Header Ads

సంతానలేమి సమస్యను దూరం చేసే శంఖు పుష్పం

శంఖువు రూపంలో నీలిరంగులో వుండే పుష్పాలు చూసేవుంటారు. ఈ నీలి రంగు పువ్వులు శనీశ్వరుడికి సమర్పిస్తే.. శనిదోష ప్రభావం తగ్గుతుందని జ్యోతిష్య నిపుణులు అంటారు. అయితే ఈ పువ్వు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట. శంఖు పుష్పం ఫాబేసి కుటుంబానికి చెందినది. ఈ మొక్క ఆసియా ఖండానికి చెందినది అయినా ఆ తర్వాత ప్రపంచం మొత్తం విస్తరించింది. ఈ పువ్వులు నీలి రంగు,తెలుపు రంగులో ఉంటాయి. 
 
Vasavi Tv
 
ఈ మధ్యకాలంలో ఆరోగ్య ప్రయోజనాల కోసం ఈ మొక్కను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీని ఆకులు, వేర్లు, విత్తనాలు, పువ్వులు అన్నింటినీ ఆయుర్వేదంలో రకరకాల వ్యాధుల నివారణకు వాడుతారు. ఈ పువ్వుల వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం..

నీలి రంగుతో కనిపించే ఈ పుష్పం మానసిక ఆరోగ్యాన్ని ఎంతో మేలు చేస్తుందట. ఈ పువ్వును తరచూ ఆహారంగా తీసుకోవడం ద్వారా మానసిక ఆందోళన మాయమవుతుంది. ఈ వుండే పువ్వును థాయ్‌లాండ్, చైనా వంటి ఆసియా దేశాల్లోని స్టార్ హోటల్స్‌లో రాయల్ ఫుడ్స్‌లో చేరుస్తున్నారు. ఈ పువ్వును అక్కడ బటర్ ఫ్లై ఫ్లవర్ అని పిలుస్తారు.

health benefits of butterfly pea flower

మహిళలకు గర్భ సంబంధిత రోగాలను నయం చేయడంలో శంఖుపువ్వులు సూపర్‌గా పనిచేస్తాయి. నెలసరి సమస్యలు, సంతాన లేమి, యూరినల్ ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవాలంటే శంఖుపువ్వులను ఎండబెట్టి తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.

శంఖు పువ్వు శరీరంలోని ఆమ్లాన్ని తొలగించే యాంటీయాక్సిడెంట్‌గా పనిచేస్తుంది. చర్మాన్ని సంరక్షిస్తుంది. శ్వాస సంబంధిత రోగాలు, హృద్రోగాలన నయం చేస్తుంది. నీలపు శంఖు పువ్వుల చెట్టు ఆకులను రుబ్బి పసుపు కలిపి వాపు ఉన్న దగ్గర రాసుకుంటే వాపు తగ్గుతుంది.

శంకు పుష్పాలను సంప్రదాయ మందుల్లో వాడుతారు. ఇది బ్రెయిన్‌కి టానిక్‌లా పనిచేసి… మెమరీ పవర్‌, తెలివితేటల్ని పెంచుతుంది. కళ్లు, గొంతులో సమస్యల్ని నివారిస్తుంది. చర్మం, మూత్ర సంబంధ వ్యాధుల్ని కూడా ఇది నయం చేస్తుంది. అలాగే ఈ పువ్వు మధుమేహ రోగులకు కూడా చాలా సహాయం చేస్తుంది. రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రణలో ఉండేలా చేస్తుంది.

Image result for శంఖు పుష్పం

ఒత్తిడి, నీరసం, మతిమరపు, నిద్ర లేమి, కంటి చూపు సమస్యలు, జుట్టు రాలిపోవుట, చర్మం వదులుగా అవ్వుట వంటి సమస్యలు వస్తుంటే ఈ పూలను ఉపయోగించడం సరైన పరిష్కారం. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్, పెప్టైడ్స్ మంచి ఫలితాల్ని ఇస్తున్నాయి.

పువ్వును లేదా ఆకును నోటిలో వేసుకొని నమలచ్చు. లేదా నీటిలో ఆకులు లేదా పువ్వులు లేదా శంఖు మొక్కలో ఏ బీగాన్ని అయినా నీటిలో వేసి మరిగించి ఆ కషాయాన్ని వడకట్టి త్రాగవచ్చు. నీలం రంగులో ఉండే ఈ శంఖు పువ్వులను ఎండబెట్టి పొడి రూపంలో నిల్వ చేసి ఫుడ్ కలర్ గా అనేక రకాల స్వీట్స్, కేకులు, ఐస్ క్రీమ్స్ వంటి వాటిల్లో వాడుకోవచ్చు.

No comments

Post Top Ad

Post Bottom Ad