గర్భం రాకుండా ఉండాలని గర్భనిరోధక సాధనాల ఫలితం లేకపోయింది.
Q : గర్భం రాకుండా ఉండాలని గర్భనిరోధక సాధనాలను ఉపయోగిస్తున్నాం. అయినా ఫలితం లేకపోయింది. ఇప్పటికే ఒకసారి గర్భం రావడం, గర్భస్రావం చేయించు కోవడం అయిపోయాయి. దీంతో నా భార్య నన్ను నెలలో ఎన్నో రోజుల పాటు దగ్గరికి రానీయడం లేదు. ఈ సమస్య నుంచి బయటపడే దెలా?
A : ఒకసారి విఫలమైందని ఇంతగా భయపడాల్సిన అవసరం లేదు. అవసరమనుకుంటే ఒకటి కి మించిన విధానాలను ఏకకాలంలో ఉప యోగించవచ్చు. వీటిని ఉపయోగించడంతో పాటుగా ఆ సమయంలో కొన్ని రకాల టెక్నిక్ లను పాటించడం ద్వారా కూడా గర్భం రాకుండా చూసుకోవచ్చు. గర్భం వస్తుందనే ఆందోళనతో లైంగిక జీవితానికి దూరం కావడం ఇద్దరి లోనూ అసంతృప్తి కలిగిస్తుంది. అది మరెన్నో రకాలుగా బయటపడుతూ ఇద్దరి మధ్యా కలతలకూ కారణం అయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో డాక్టర్‌ను కలసి తగు సలహా తీసుకోవచ్చు. నేడు వైద్య విధానాల్లో పెనుమార్పులు వస్తున్న నేపథ్యం లో ఎన్నో రకాల గర్భనిరోధక సాధనాలు నూతనంగా అందుబాటులోకి వస్తున్నాయి. మీకు తగ్గవాటిని, మీకు అందుబాటులో ఉన్న వాటిని ఎంచుకొని ఉపయోగించడం మంచిది.
గర్భనిరోధానికి ఏ విధానాన్ని ఉపయోగించి నా అందులో మంచీ, చెడూ ఉంటాయి. కొన్ని రకాల మాత్రలు వాడడం వల్ల హార్మోన్ల సమ తుల్యతలో మార్పులు రావచ్చు. మరికొన్ని రకాల సాధనాలు వాడడం వల్ల మగవారిలో తృప్తి లోపించవచ్చు. ఇంకొన్ని రకాల వల్ల ఆడవారికి శరీరంలో నొప్పి లాంటివి కలగ వచ్చు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఒక నిర్ణయానికి రావడం మంచిది. ఒక్క వైఫల్య భయంతో జీవితాన్ని నరకం చేసుకోవడం మూర్ఖత్వం. గర్భం వస్తుందన్న భయం మనస్సులో ఉంటే లైంగిక జీవితాన్ని ఆనందించలేరు. ఇలా ఆందోళనలతో జీవితం గడపడంతో ఇతరత్రా మానసిక, శారీరక సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. పరిష్కారమార్గం అన్వేషించడం ఉత్తమం.