నాకింకా పెళ్లి కాలేదు. కాబట్టి హస్తప్రయోగం చేసుకుంటున్నాను......?
ప్రశ్న : నాకు పాతికేళ్లు. ఈ మధ్య వరకు నాకు లైంగిక వాంఛలు బాగానే వుండేవి. అంగస్తంభన కూడా నార్మల్‌గానే వుండేది. కానీ, ఇటీవల నా అంగం సరిగా స్తంభిండం లేదు. నాకింకా పెళ్లి కాలేదు. కాబట్టి హస్తప్రయోగం చేసుకుంటున్నాను. అపుడు ఎక్కువ ఒత్తిడి కలిగించడంవల్ల ఇలా అంగం మెత్తబడిపోయిందని నా అనుమానం. నా అంగం మామూలుగా స్తంభించాలంటే ఏం చేయాలి?(ఒక అబ్బాయి )
జవాబు : మీకు ఏర్పడిన సమస్య యాంగ్జయిటీ వల్ల వచ్చిందే తప్ప, మరొకటి కాదు. ఒకసారి కాకపోయినా మరోసారయినా మీ అంగం స్తంభిస్తున్నట్టయితే మీకు ఏ మసస్యా లేనట్టే. హస్త ప్రయోగం తప్పుకాదు. ఆ సమయంలో ఎక్కువ ఒత్తిడి కలిగించడం వల్ల అంగస్తంభన దెబ్బతినడం అనేది జరగదు. మీరు ఎక్కడో విన్న విషయాలను అన్వయించుకుని బుర్రపాడు చేసుకోకండి. అంగస్తంభన కావడం లేదన్న యాంగ్జయిటీ పెరిగిపోవడం వల్ల కూడా అంగస్తంభన సమస్య మరీ తీవ్రంగా వున్నట్టు అనిపిస్తోంది. కాబట్టి ముందుగా మీరు రిలాక్స్ అవ్వండి. కొంతకాలం పాటు ఈ విషయాన్ని మరిచిపోండి. పూర్తిగా మీ మానసిక స్థితి మామూలుగా మారేంతవరకు ఓపిక పట్టండి. తర్వాత మీరు పెద్దగా ప్రయత్నించకుండానే అంగం స్తంభన మమూలుగా జరుగుతుంది.