రతి తర్వాత ఏమి చేయాలో తెలుసా !
స్త్రీ పురుషులు రతి తర్వాత గోరు వెచ్చనినీటితో స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత తాంబూలం సేవించాలి. గంధం వంటి సుగంధ పరిమళ ద్రవ్యాలను స్తీకి పురుషుడే స్వయంగా రాస్తూ ఆమెను తిరిగి ఆలింగనం చేసుకుని ఇద్దరూ తమకిష్టమైన పానీయాలు, ఆహారాలు సేవించాలి. తర్వాత ఆరుబయట వెన్నెలలో స్త్రీ ఒడిలో పురుషుడు చేరి ఎక్కువగా శృంగార సంబంధమైన విషయాలే ముచ్చటించుకోవాలి.
ఇలా ఎందుకు చేయాలంటే…
రతి తర్వాత స్త్రీ పురుషులకు అలసట కలిగి చెమట పడుతుంది. ఈ అలసట తీర్చటానికి స్నానం అవసరం. తాంబూల సేవనం ఆరోగ్యకరం అని ఆయుర్వేదం చెబుతోంది. ఇక స్త్రీ పురుషులు సన్నిహితంగా కబుర్లు చెప్పుకోవడంతో ఒకరి ఇష్టాయిష్టాలు తెలుసుకోవడం వల్ల ఒకరిపై మరొకరికి మరింత ప్రేమ కలుగుతుంది. రతి క్రీడలో పాల్గొన్న స్త్రీ పురుషులు పూర్వ పరిచయం కలిగిన వారైతే తాము ప్రేమికులుగా ఉన్న కాలంలో, తన ప్రేమను వెల్లడించకముందు ఒకరికోసం ఒకరు ఎంతగా పరితపిచినదీ చెప్పుకోవాలి. దీనివల్ల వారిమధ్య నమ్మకం పెరిగి ప్రేమానురాగాలు బలపడతాయి.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే రతి క్రీడ తర్వాత సుమారు రెండుగంటల వరకూ ఎటువంటి వ్యాయామం చేయకూడదు. అలాగే రతి క్రీడ అనంతరం స్త్రీ పురుషులు జననావయవాలను శుభ్రం చేసుకోవాలి. స్త్రీ జననావయంలో క్రిములు ఉండే అవకాశం ఉందని, ఆ క్రిముల వల్ల కొన్నిసార్లు వ్యాధుల పాలయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నాడు. అందువల్లే సంభోగానంతరం స్నానం చేయాలని, జననావయవాలను శుభ్రం చేసుకోవాలని మనం అర్ధం చేసుకోవచ్చు.