మొదటి రాత్రిని చిరస్మనీయంగా ఎలా మార్చుకోవటం
a2z Health-Beauty Tips
|
Post Views :
మొదటి రాత్రిని ప్రతి ఒక్కరు చిరస్మరనీయంగా మార్చుకోటానికి ఆశ పడుతుంటారు. కారణం మొదటి రాత్రి జీవితంలో ఒకేసారి వస్తుంది. మీ జీవితంలో కూడా మొదటి రాత్రి గురించి ఒక అంఖం ఏర్పరచుకోటానికి మంచి సూచనలు ఇక్కడ తెలుపబడ్డాయి.
- 1
మంచి బయట ప్రదేశాలలో
జీవితంలో వివాహం మరియు మొదటి రాత్రి ఒక్కసారి మాత్రమే వచ్చే, ప్రాధాన్యత కలిగిన కార్యాలు. కావున వీటిని చిరస్మనీయంగా మార్చుకోండి. దీని కోసం గానూ, మీ ఇంట్లోనే కాకుండా మంచి ప్రదేశాలకు వెళ్ళే విధంగా పథకాన్ని తయారు చేసుకోండి. అంతేకాకుండా, ప్రత్యేక ప్రదేశాలకు కారులో వెళ్ళండి. మంచి సినిమా చూస్తూ, సమయాన్ని కేటాయించండి. సినిమా తరువాత హోటల్ వంటి వాటి కన్నా కారులోనే పూర్తి సమయాన్ని కేటాయించండి. - 2
ఆమెను ఆశ్చర్యంలో ముంచండి
కొత్తగా వివాహమైన పురుషులు తప్పక పాటించాల్సిన కార్యం. మగువలు ఎక్కువగా ఆశ్చర్యానికి గురవటానికి ఇష్ట పడుతుంటారు మరియు మీరు ఆశ్చర్యానికి గురి చేసిన ప్రతి ఒకసారి ఎగిరి గంతేసి మీ పైన వాలిపోతుంటారు అవునా! ఆశ్చర్యానికి గురి చేసేవి అనగానే ప్రతి ఒక్కరు తప్పుగానే భావిస్తారు అనగా ఖరీదైన బహుమతులు, బంగారు ఉంగరాలు లేదా డిమాండ్'తో చేసిన ఉంగరాలు అనే అనుకుంటారు. ఆమె మీ జీవిత భాగస్వామి కావున ఆమెకు ఇష్టమైన వాటిని ఇవ్వండి ఆమెను సంతోషంగా ఉంచే కారకాలకు దగ్గరగా ఉంచండి. మీ భార్యకు ఇవి వేల కట్టలేని బహుమతులు అని చెప్పవచ్చు. - 3
శృంగార భావనను కలిగించండి
శృంగార భావనను కలుగ చేయటం వ్యక్తులను బట్టి మారుతుంటుంది. కానీ మీ ముఖ్య ఉద్దేశం శృంగారం జరపటం, కావున దాని పైన దృష్టిని కేంద్రీకరించి, మీ భాగస్వామిని ఆనందంగా ఉంచండి. మీ భాగస్వామిని సంతోషంగా ఉంచటానికి పాటలను పడండి లేదా మీరు వేటిలో ప్రావిణ్యం కలిగి ఉన్నారో దానిలోనే తనను ఆనందింప చేయండి. ఆమెపై లేదా అందంపై కవిత్వం రాసి వినిపించండి. ఫలితంగా తనపై ఉన్న మీ ప్రేమను అర్థం చేసుకుంటుంది. - 4
నిదానంగా వ్యవహరించండి
శృంగారానికి పూర్తి రాత్రి అందుబాటులో ఉంది కావున నెమ్మదిగా ప్రారంభించండి. సమయం చాలా ఉంది కావున బలవంతంగా, దూకుడు స్వభావంతో కాకుండా నెమ్మదిగా మీ కార్యాలను నిర్వహించండి. పూర్తి రాత్రిని సంతోషంగా గడుపుటకు వైన్ తీసుకోండి మరియు ఇద్దరి చర్చించుకోండి. సమయంలో మీ భోజనాన్ని ముగించండి. భోజన సమయంలో కూడా తన ఇష్టాల గురించి తెలుసుకోండి. - 5
తియ్యటి మాటలు
భాగస్వామితో జాగ్రత్తగా, తియ్యగా మాట్లాడండి. మొదటి రాత్రిలో మీలో ఉన్న ప్రతికూల విషయాల గురించి కానీ, మీ జీవితంలో అనుభవించిన చేదు అనుభవాల గురించి చర్చించకండి. కాలేజీ రోజుల సమయంలో మీ స్నేహితులతో చేసిన చెడు పనుల గురించి కానీ లేదా ప్రేమ వ్యవహారాల గురించి చర్చించకండి. వీటి వలన ఆమె మనసులో మీపై చెడు అవగాహన కలిగి, మొదటి రాత్రిలో శృంగారంపై ప్రభావం పడే అవకాశం ఉంది. కావున ఎల్లపుడు మంచి విషయాల గురించి మరియు అందంగా మాట్లాడటానికి ప్రయత్నించండి. - 6
మాట్లాడకుండా సంభాషించుకోండి
సినిమాలో చూసినట్లయితే, హిరో మరియు హిరోయిన్ మాటలు లేకుండానే ప్రేమలో మునిగి, శృంగారాన్ని అనుభవిస్తారు. ఇద్దరి మధ్య సంభాషణ మాటలలో కాకుండా, కళ్ళు మరియు అంగాల ద్వారా సంభాషణ కొనసాగిస్తారు అవునా! ఇలా మీరు చేసినట్లయితే, మీ భాగస్వామితో పాటూ మీరు శృంగారంలో ఉన్న ఆనందాన్ని పూర్తిగా అనుభవిస్తారు. మాటలతోనే కాకుండా, చాలా రకాలుగా ఇద్దరి మధ్య సంభాషణను కొనసాగించవచ్చు. - 7
ఆటను ఆడండి
మీ మొదటి రాత్రిని మధురానుభవంగా మార్చుకోవాలి అనుకుంటున్నారా! అయితే నవ్వులతో మరియు హస్యాలతో కొనసాగించండి. ఎక్కువ హాస్యాలు మరియు నవ్వులతో నడిచే రాత్రి, ఇద్దరి జీవితంలో ఒక మధుర ఘట్టంగా మిగిలిపోతుంది. కావున, ఇద్దరు మంచి ఆటలను ఆడండి! మొదటి రాత్రిలో తాగుతూ, చిన్న చిన్న ఆటలను ఆడటం ఉహించండి. తాగటం అధికం అయితే మాత్రం మీ మొదటి రాత్రి చెడిపోయే అవకాశం ఉంది. కావున జాగ్రత్తగా వ్యవహరించండి. - 8
గొడవల గురించి మాట్లాడకండి
మొదటి రాత్రి మీ భాగస్వామితో ఉన్నపుడు గొడవల గురించి, సమస్యల గురించి మాత్రం మాట్లాడకండి. ఫలితంగా ఇద్దరిలో శృంగారం పై ఉన్న మక్కువ తగ్గే అవకాశం ఉంది. గొడవలు మరియు సమస్యల గురించి కాకుండా, ఉల్లాసంగా, చైతన్యవంతంగా శృంగారంపై దృష్టి పెట్టండి. ఒత్తిడిగా భావించకండి భాదల గురించి, చింతల గురించి ఆలోచినంచకండి, ''గతం గతః'' అని గుర్తు చేసుకోండి, రాత్రి దాటితే రేపు, కావున ఉన్న నిమిషం సంతోషంగా జీవించటానికి, ప్రతి నిమిషం ఆనందం కోసం వెతకండి. మీ మొదటి రాత్రిని జీవితంలో మధుర ఘట్టంగా మార్చుకోండి.