Header Ads

ప్రసవం తర్వాత కోరికలు...Desires after Child Birth

ప్రసవం తర్వాత కోరికలు...
 16-10-2018: డాక్టర్‌! నాకు 3 నెలల క్రితం సాధారణ ప్రసవం అయింది. అయితే ప్రసవం అయినప్పటి నుంచి నాలో లైంగిక కోరికలు అడుగంటిపోయాయి. ఈ పరిస్థితి వల్ల ఆయనకు దగ్గర కాలేకపోతున్నాను. దాంతో ఇద్దరి మధ్య దూరం పెరుగుతున్నట్టు అనిపిస్తోంది. ప్రసవం తర్వాత తిరిగి మునుపటిలా లైంగిక జీవితం సాగడానికి ఎంత సమయం పడుతుంది?
- ఓ సోదరి, హైదరాబాద్‌
 
ప్రసవం తర్వాత శరీరం ఎన్నో మార్పులకు లోనవుతుంది. తిరిగి మునుపటిలా జీవక్రియలన్నీ సజావుగా సాగడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. ఇది మహిళలందరిలో ఒకేలా ఉండదు. లైంగిక కోరికలు కూడా వారి వారి శరీరం తీరు మీద ఆధారపడి ఉంటాయి. కొందరికి ప్రసవం అయిన కొద్ది రోజులకే పరిస్థితి మునుపటిలా మారిపోవచ్చు. మరికొందరికి నెలలు గడుస్తున్నా లైంగిక కోరికలనేవి కలగకపోవచ్చు. అయితే ఈ విషయంలో కంగారు పడవలసిన అవసరం లేదు. కొత్తగా తల్లి అవడం, పిల్లాడి పనులు, నిద్ర లేకపోవడం, ఇంటి బాధ్యతలు.... ఇవన్నీ కొత్తగా తల్లయిన మహిళల్లో ఒత్తిడి కలిగిస్తాయి. దాని వల్ల కూడా లైంగిక కోరికలు తగ్గుతాయి. అయితే ఈ విషయంలో భర్తకు అవగాహన కల్పించి, పనుల్లో సాయం అందించమనీ, తిరిగి పరిస్థితి అనుకూలించేవరకూ సహకరించమనీ చెప్పవచ్చు. అలాగే ప్రసవం తర్వాత ఒడలిన శరీరం వేగంగా పుంజుకోవడానికి, తగినంత ఫిట్‌నెస్‌ సమకూరడానికి, కటి కండరాలను బలపరిచే ‘కెగెల్‌ వ్యాయామం’తోపాటు, నడక, పరుగు లాంటి వ్యాయామాలు దినచర్యలో భాగం చేసుకోవాలి. ఈ వ్యాయామాలు సాధారణ ప్రసవం జరిగిన ప్రతి మహిళా చేయవచ్చు.
డాక్టర్‌ షర్మిలా మజుందార్‌
సెక్సాలజిస్ట్‌ అండ్‌ సైకో అనలిస్ట్‌
email: mili77@gmail.com
(కన్సల్టేషన్‌ కోసం)

Post Top Ad

Post Bottom Ad