Header Ads

ఇలా చేస్తే రెండుగంటల్లో మీ జుట్టు నల్లబడిపోతుంది.

తెల్ల జుట్టు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఉన్న సమస్యే! Genetic factorsతో పాటు, పొల్యూషన్‌, ఒత్తిడి, పోషకాహార లోపం... ఇలా ఏదో ఒక కారణంతో మనకి చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చేస్తోంది. ఓసారి తెల్ల జుట్టు వచ్చాక దానికి రంగు వేయడం కోసం రకరకాల హెయిర్‌ డైస్‌ ఉపయోగిస్తుంటాం. ఈ హెయిర్ డైస్‌లో PPD, అమోనియా, peroxide లాంటి నానారకాల కెమికల్స్ ఉంటాయి. ఇవి చాలారకాల side effectsకి దారి తీస్తుంటాయి. అలాగని జుట్టుని వదిలేద్దామా అంటే నలుగురిలో తిరగాలంటే కష్టంగా ఉంటుంది. మరి నేచురల్‌గా తెల్లజుట్టుని నల్లగా మార్చుకునే చిట్కా ఉందా అంటే లేకేం! తెల్లని జుట్టుని నల్లగా మార్చేయడంతో పాటు... జుట్టు మృదువుగా, ఆరోగ్యంగా మార్చేసే ఉపాయం ఒకటి ఉంది.

దీనికోసం మనకి మూడంటే మూడు వస్తువులు ఉంటే చాలు. అవి కూడా మనకి తేలికగా అందుబాటులో ఉండేవే! ఒకటి- హెన్నా పొడి. దీని కోసం ఏ పొడి పడితే ఆ పొడిని తీసుకోకండి. మార్కెట్లో దొరికే చాలా హెన్నా పొడులలో కూడా ఇప్పుడు PPDలాంటి కెమికల్స్‌ని కలుపుతున్నారు. అందుకని స్వచ్ఛమైన గోరింటాకు పొడినే తీసుకోండి. ఇక రెండోంది- ఆమ్లా అంటే ఉసిరి పొడి. ఇది ఏ ఆయుర్వేదం షాపులో అయినా దొరుకుతుంది. ఇక మూడోది- రెండు టీస్పూన్ల నల్లటి టీపొడి. ఈ మూడింటినీ ఉపయోగించి నేచురల్ హెయిర్‌ డై ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం!

ముందుగా టీపొడిని ఓ చిన్న గ్లాసుడు నీటిలో మరిగించండి. మంచి డికాషన్‌ తయారయ్యేదాకా ఇలా మరిగించండి. టీ డికాషన్‌ సహజసిద్ధమైన నల్లటి రంగుని ఇస్తుంది. పైగా ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ జుట్టుని ఆరోగ్యంగా, మృదువుగా ఉంచుతాయి. ఈ డికాషన్‌ చల్లారిన తర్వాత ఒక గిన్నెలో నాలుగు చెంచాల హెన్నా పొడినీ, రెండు చెంచాల ఆమ్లా పౌడర్‌నీ తీసుకోండి. హెన్నా మన జుట్టు రంగుని కాస్త ఎరుపు రంగులోకి మారుస్తుంది. కానీ ఆమ్లా పౌడర్‌కి జుట్టుని నల్లగా మార్చే గుణం ఉంది. అందుకనే హెన్నాకి ఆమ్లా పౌడర్‌ని తప్పకుండా కలపాలి. ఇలా కలిపిన పొడిలో కొంచెం కొంచెంగా డికాషన్‌ కలపాలి. జుట్టుకి పట్టించేందుకు వీలుగా, ఒక పేస్టులా తయారయ్యేవరకు ఈ డికాషన్‌ని కలపాలి.
ఈ పేస్టుని మీ జుట్టు మొత్తం కుదుళ్ల వరకూ పట్టించండి. ఇలా రెండు గంటలపాటు ఉంచిన తర్వాత తలస్నానం చేయండి. అంతే! తెల్లటి మీ జుట్టు కాస్తా నల్లగా మారిపోవడం చూస్తారు. కనీసం నెల రోజుల వరకైనా మీ జుట్టు ఇదే రంగులో కనిపిస్తుంది.  https://www.youtube.com/watch?v=C_D5BNH77-w



Post Top Ad

Post Bottom Ad