ఫస్ట్ టైమ్ సెక్స్ లో పాల్గొనేవారు ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి..!
శృంగారమంటే అదొక ప్రకృతి సహజ సిద్ధమైన కార్యం. ఇద్దరు దంపతులు సృష్టి క్రమం కోసం నిమగ్నమయ్యే పని. కానీ నేటి తరుణంలో దీనికి అర్థమే మారిపోయింది. శృంగారమంటేనే అదొక వినకూడని పదంగా, సిగ్గు పడే పదంగా భావిస్తున్నారు. దాన్ని అలాగే చూస్తున్నారు. కానీ నిజానికి శృంగారమంటే సిగ్గు పడే పని ఎంత మాత్రం కాదు. జీవిత భాగస్వామితో కాకుండా ఎవరితో పడితే వారితో శృంగారం చేస్తే అప్పుడు నిజంగానే సిగ్గు పడాలి. దంపతులు శృంగారంలో పాల్గొంటే సిగ్గు పడాల్సిన పనిలేదు. అయితే శృంగారంలో ఎవరితో ఎవరు పాల్గొన్నప్పటికీ మొదటి సారి అందులోకి దిగే వారికి మాత్రం కొంత బిడియం, భయం సహజం గానే ఉంటాయి. ఈ క్రమంలో అలాంటి వారు కింద ఇచ్చిన కొన్ని అంశాలను గమనిస్తే దాంతో వారి శృంగార జీవితం సంతృప్తికరంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఆ అంశాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. మొదటి సారి శృంగారంలో పాల్గొంటున్న వారు కచ్చితంగా గమనించాల్సిన విషయం ఇది. జీవిత భాగస్వామితో గనక మొదటి సారి రతి క్రీడలో పాల్గొంటున్నట్టయితే కండోమ్ లేకపోయినా ఏమీ కాదు. కానీ అలా కాకుండా పాల్గొంటే మాత్రం కచ్చితంగా సురక్షితమైన పద్ధతులను పాటించాల్సి ఉంటుంది. లేదంటే భవిష్యత్తులో ఎలాంటి రోగాలైనా వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
2. చాలా మంది మొదటి సారి రతి క్రీడలో పాల్గొంటున్నప్పుడు ఎంతో ఆశించి ముందుకు దూకుతారు. కానీ నిజానికి అంతగా ఊహించుకుని ఎవరూ ముందుకు వెళ్లకూడదు. ఎందుకంటే చాలా వరకు ఇలాంటి సందర్భాల్లో వారు ఆశించినంతగా ఏమీ మొదటి సారి ఉండదు. కాబట్టి ఎలాంటి ఆశ పెట్టుకోకుండా, దాని గురించి ఎక్కువగా ఆశించకుండా ముందుకు వెళ్లడం మంచిది.
3. చాలా మంది నేరుగా రతి క్రీడలోకి దిగుతారు. కానీ అది నొప్పితో ముగుస్తుంది. కనుక మొదటి సారి శృంగారంలో పాల్గొనేవారు ముందుగా ఫోర్ ప్లేను ఆశ్రయించాలి. అనంతరం నెమ్మదిగా అసలు కార్యంలోకి దిగాలి. దీంతో కొంత తృప్తి కలిగేందుకు అవకాశం ఉంటుంది.
4. మొదటి సారి శృంగారంలో పాల్గొంటున్న పురుషుడు లేదా స్త్రీ తమకు తామే తమకు అంతా తెలుసని అనుకుంటారు. కానీ అలా అనుకోవడం వల్ల మొదటికే మోసం వస్తుంది. అవతలి వారు కూడా ఆ క్రియలో నేర్పరులు అయి ఉండవచ్చు కదా. అందుకని వారు తమకు తామే అందులో నేర్పరులమని అనుకోకూడదు.
5. తొలి సారి రతిక్రీడలో పాల్గొన్నప్పుడు దాదాపుగా చాలా మంది సంతృప్తి చెందరు. కానీ తమ భాగస్వామిని నిరాశకు గురి చేయడం ఇష్టం లేక తాము తృప్తి చెందామని అబద్దం చెబుతారు. ఇలా చేయకూడదు. దీంతో భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యేందుకు అవకాశం ఉంటుంది.
6. మొదటి సారి శృంగారం చేసినప్పుడు భాగస్వాముల్లో ఇద్దరికీ భావప్రాప్తి కలగకపోవచ్చు. లేదంటే ఒకరికి కలిగి మరొకరికి కలగకపోవచ్చు. అందుకని నిరాశ చెందకూడదు. తొలిసారి అది సహజమే. దాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగితే పార్ట్‌నర్స్ ఇద్దరి శృంగార జీవితం సుఖమయం అవుతుంది.
No comments