Header Ads

నా భార్యను ఎక్కువ సేపు సుఖపెట్టాలంటే ఎలా డాక్టర్..?

డాక్టర్..నా భార్యతో రతిలో పాల్గొన్న ప్రతిసారీ ఎక్కువ సేపు చేయాలనుకుంటాను. కానీ నాకు చాలా త్వరగా అయిపోతోంది. దీనివల్ల నా భార్య రతిలో తృప్తిగా లేదేమో అని అనిపిస్తోంది. ఎక్కువ సేపు చేయాలంటే ఏమైనా మార్గాలున్నాయా..దయచేసి నా సమస్యకు పరిష్కారాన్ని తెలపండి..


Couple in Love Silhouette by safetstudio | VideoHive


ప్రతీ మగవాడు, తన రతి జరిపే స్త్రీతో ఎక్కువ సేపు చేయాలని, ఆమె ఒక చాలు అనేవరకూ తృప్తి పరచాలని కోరుకుంటాడు. అయితే, అది చాలా తక్కువమందికి మాత్రమే సాధ్యపడుతుంది. మహా అయితే రెండు లేదా మూడు నిముషాల మించి చాలామంది మగవాళ్లు కొనసాగలేరు. దీనికి రకరకాల కారణాలున్నాయి. అలాగే ఈ సమస్యకు చాలా పరిష్కారాలు కూడా ఉన్నాయి.
నేటి ఉరుకుల పరుగుల జీవితాల్లో సెక్స్ అనేది బాగా యాంత్రికంగా మారిపోయింది. భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు ఆస్వాదించుకుని సెక్స్ అనుభవించట్లేదు. ఇది మంచి పరిణామం కాదు. రతి అనేది కేవలం కోరిక తీర్చుకోవడానికి మాత్రమే కాదు, ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత బలపరచడానికి, ఆరోగ్యానికి కూడా ముఖ్యం. మీ సమస్య విషయానికొస్తే, అందుకు రకరకాల కారణాలున్నాయి.

ఎక్కువ సేపు సెక్స్ కు టైమ్ కేటాయించకుండా, త్వరగా అయిపోవాలి అని కోరుకోవడం, తీసుకునే తిండిలో సరైన పోషకాహారాలు ఉండకపోవడం, ఎలా చేస్తున్నానో అన్న ఆందోళన, ఆదుర్దా లాంటివన్నీ కూడా ఈ సమస్యకు కారణాలు. అయితే కారణాలతో పాటు, పరిష్కారాలు కూడా ఉన్నాయి.

ఇద్దరూ బెడ్ మీదకు చేరగానే సెక్స్ కార్యక్రమాన్ని డైరెక్ట్ గా మొదలుపెట్టేయడంతోనే అసలు సమస్య వస్తుంది. ముందుగా ఖచ్చితంగా ఫోర్ ప్లే చేసుకోవాలి. అంటే స్త్రీ పురుషులిద్దరూ ఒకరినొకరు చేతులతో, ముద్దులతో తృప్తి పరుచుకోవాలి. ఇక ఇద్దరూ ఆగలేం అనుకున్న తర్వాతే అసలు కార్యంలోకి చేరుకోవాలి.అందుకే సెక్స్ కి ముందు ఫోర్ ప్లే చేస్తూ సెక్స్ చేయడం ద్వారా చాలా సేపు శృంగారం చేయవచ్చు. అది కూడా ఒక పద్ధతిలో చేయడం ద్వారానే మొదటగా స్త్రీ పురుషులు ఇద్దరు కూడా కళ్ళతో శృంగారభరిత ముచ్చట్లు ముచ్చట ఇస్తూ ఒక రకమైన రొమాటిక్ ఫీల్ క్రియేట్ చేసుకుంటూ మన వెచ్చటి కౌగిలింతలో బంధించడం ద్వారా ఆక్సిటోసిన్ (OXYTOCIN) అనే హార్మోన్ విడుదల అవుతుంది. ముద్దులతో మొదలుపెట్టి నెమ్మదిగా ఆమె ఎదలను ప్రెస్ చేస్తూ చేస్తూ సుకుమారంగా ఫోర్ ప్లే చేస్తుంటే, ఆమెలో ఎండార్ఫిన్ (ENDORPHIN) హోర్మోన్ విడుదలై మత్తును కలిగిస్తుంది. అది వారిలో ఉద్రేకాన్ని పెంచుతుంది. మగాడు ఆ మత్తులోకి తీసుకెళ్తుంటే అమ్మాయిలు సెక్స్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు.

దీని ద్వారా, ఇద్దరిలోనూ కోరికలు తారాస్థాయికి చేరుకున్న సమయంలో రతి జరుగుతుంది. అది ఇద్దరికీ చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఫోర్ ప్లే బాగా చేస్తే, రతి కేవలం 2 నిముషాల లోపే ఇద్దరికీ అయిపోయినా, ఎలాంటి అసంతృప్తి ఉండదు. అలా కాదు, ఇంకా కొనసాగించాలనుకుంటే, స్టాప్ అండ్ స్క్వీజ్ అనే టెక్నిక్ ఉంది. ఈ టెక్నిక్ లో, మీరు చివరకు వచ్చేస్తున్నారు అనుకున్నప్పుడు, వెంటనే రతి చేయడం ఆపేయండి. ఒక 10 సెకన్లు ఆగి మళ్లీ మొదలు పెట్టండి. తద్వారా, మరింత ఎక్కువ సేపు రతిలో కొనసాగగలుగుతారు. మీతో పాటు మీ పార్టనర్ కు కూడా ఇది మంచి తృప్తినిస్తుంది. ఇద్దరూ ఒకరిని ఒకరు అనుభవిస్తూ, ఆనందిస్తూ ఒకరిలో ఒకరు కలిసిపోయి, ఇద్దరూ ఒకటైతేనే అసలైన రతి కార్యంలోని ఆనందం తెలుస్తుంది.

No comments

Post Top Ad

Post Bottom Ad