రావి ఆకులతో మధుమేహానికి చెక్..
మన దేశంలో పవిత్రమైన రావి చెట్టుకు ఉండే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఈ చెట్టును పవిత్ర చెట్టుగా ఎందుకు భావిస్తారంటే… దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. రావి చెట్టులో ప్రతీ భాగంలోనూ ఔషధ గుణాలున్నాయి. అందుకే ఈ చెట్టును రకరకాల వ్యాధుల్ని తరిమికొట్టేందుకు ఉపయోగిస్తున్నారు.
ఓవైపు ఈ చెట్టుకు పూజలు చేస్తూనే… మరోవైపు… దీని ఆకులు, బెరడు, కాండం, విత్తనాలు, పండ్లను ఔషధాల తయారీలో వాడుతున్నారు. ఇప్పుడు రావిచెట్టు వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం..
రావి ఆకు, పండ్లు, బెరడును విడివిడిగా ఎండబెట్టి… పొడి చేసుకోవాలి. వీటిని సమాన పరిమాణంలో కలిపి ఈ మిశ్రమాన్ని రోజుకు మూడుసార్లు వాడితే, ఆస్తమా సమస్య తగ్గుతుంది. రావి ఆకు పొడిని మూడు గ్రాములు తీసుకొని, నీటిలో కలిపి… రోజుకు రెండుసార్లు తాగినా చక్కగా పనిచేస్తుంది.
ఆకలి పెంచడానికి బాగా పక్వానికి వచ్చిన రావి పండ్లు ఉపయోగపడతాయి. వీటిని తినడం వల్ల దగ్గు, రక్త సంబంధ సమస్యలు, పిత్త దోషాలు, కడుపులో మంట, వాంతులు కూడా తగ్గుతాయి.
నాలుగు రావి ఆకుల్ని తీసుకొని పొడి చేసి నీటిలో కలపాలి. ఆ నీటిని ఫిల్టర్ చేసి తాగాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే… డయాబెటిస్ చాలా వరకూ నయం అవుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
నపుంసకత్వం సమస్య నుంచి బయటపడటానికి అర స్పూన్ రావి పండ్ల పొడిని పాలలో కలిపి రోజుకు మూడుసార్లు తీసుకోవాలి. తద్వారా శరీరానికి బలం వచ్చి, నపుంసకత్వం నుంచి బయటపడొచ్చు. తగిన మోతాదులో రావి పండ్లు, దాని వేర్లు, శొంఠిని కలపాలి. పాలు, తేనె, పట్టిక మిశ్రమానికి దీన్ని కలిపి తీసుకోవడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.
రావి ఆకుల రసాన్ని రెండు లేదా మూడు స్పూన్లు తీసుకుంటే పాము కాటు విషానికి విరుగుడుగా పనిచేస్తుంది. ఐతే పాము కాటు వేసినప్పుడు ఈ ఆకుల రసం తీసుకునేంత టైమ్ ఉండకపోవచ్చు. అంతేకాదు రావి ఆకుల్ని తింటే తామర లాంటి వ్యాధులు రావు. రావి ఆకుతో టీ తయారుచేసుకొని తాగితే మంచిదే.
కడుపు నొప్పి తగ్గేందుకు రావి ఆకులు ఐదు తీసుకొని… పేస్టులా చేసి… బెల్లం కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసుకొని… రోజూ మూడు లేదా నాలుగు సార్లు తీసుకోవాలి. అధిక బరువుతో బాధపడేవారు నాలుగు రావిఆకులను గ్లాసున్నర నీటిలో వేసి ఒక గ్లాసు నీరు అయ్యే వరకు మరిగించి తాగడం వల్ల బరువు తగ్గుతారు.
No comments