పీడకలలు వస్తే ఏమవుతుందో తెలుసా ?
చిన్న పిల్లలు నుంచి పెద్దల వరకు అందరికీ నిద్ర చాలా అవసరం. ఒక్కరోజు నిద్ర లేకపోయినా అనేకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. చాలామంది పడుకొనే ఉంటారు కానీ నిద్రపోరు. ఏదోకటి ఆలోచిస్తుంటారు. దీనికి కారణం వారిని వెంటాడే పీడకలలే. దీని గురించి పరిశోధకులు కొన్ని విషయాలు చెబుతున్నారు. రోజంతా కష్టపడి రాత్రి కొంచెం విశ్రాంతి తీసుకుందామని పడుకుంటే ఏవేవో పీడకలు వెంటాడుతుంటాయి. ఉదయం లేచేసరికి కొన్ని గుర్తుంటాయి. కొన్నిసార్లు అసలు ఏం కలులు రానట్లు ఉంటుంది.
రాత్రి పీడకలలు రాకుండా ఉండాలంటే ఏం ...
కొన్నిసార్లు కలలో వచ్చినవి నిజజీవితంలో జరుగుతుంటాయి. కళలో దగ్గరవాళ్లు చనిపోయినట్లు వస్తుంటాయి. ఇది నిజమవుతుందేమో అని భయపడుతుంటారు. ఆ భయంతో ప్రశాంతతకు దూరం అవుతారు. పీడకలలు రావడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఆందోళన, తీవ్ర ఒత్తిడి, కుంగుబాటుకు గురికావచ్చని పరిశోధకులు తెలుపుతున్నారు. నిద్రలో వచ్చే పీడకలలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. వీటివల్ల నిద్రపోవాలంటే భయపడే పరిస్థితి ఉంటుంది. ఇది క్రమేనా నిద్రలేమికి దారితీస్తుంది. మీకూ పీడకలలు వస్తుంటే వాటి నుంచి బయటపడండి. జాగ్రత్త వహించండి. వీలైతే మానసిక నిపుణులు సంప్రదించండి.
No comments