Header Ads

అతివల అందానికి కొన్ని చిట్కాలు మీ కోసం…

ఆడవాళ్లు అందంగా ఉండడం కోసం ఎన్ని చిట్కాలు అయినా పాటించడానికి సిద్ధంగా ఉంటారు. ఇంతకుముందు అందరు ఇంటి చిట్కాలనే ఎక్కువగా పాటించేవారు. కానీ మార్కెట్లో అందుబాటులో చాలా రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ఉండడంతో అందరు వాటివైపే మొగ్గుచూపుతున్నారు. అవి తక్కువ టైములో ఎక్కువ రిజల్ట్స్ చూపిస్తుంది కాబట్టి వాటి వైపు చూస్తున్నారు. కానీ వాటిలో వాడే కెమికల్స్ వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి ఇంటి చిట్కాలతో మీ ముఖ వర్చస్సు పెరగాలంటే ఈ చిట్కాలను పాటించండి.

అందానికి చిట్కాలు | Beauty Care | Beauty Skin | Beauty Tips | Beauty Tips  For Face | Homemade Beauty Tips | Skin Care

మీ ముఖం కాంతితో మెరవాలంటే తులసి ఆకుల గుజ్జును నిద్రకు ముందు ముఖానికి పట్టించి ఉదయం లేవగానే చన్నీటితో కడిగితే ముఖం కాంతివంతం అవుతుంది.


మొటిమల బాధితులు తాజా పెరుగులో కొద్దిగా శనగపిండి కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని తర్వాత చన్నీటితో కడిగితే ఎంతటి మొండి మొటిమలైనా మాయమవుతాయి.

Related image

వేధించే మొండి మొటిమలకు పండిన టమాటా లేదా వెల్లుల్లి లేదా పుదీనా రసం రాసి బాగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే మొటిమలు మాయం కావాల్సిందే.


ముఖం మీద ముడతలు, నల్లని మచ్చలతో ఇబ్బంది పడేవారు బొప్పాయిపండు గుజ్జుని కళ్ళకి తగలకుండా ముడతలు, మచ్చల మీద రాసి అరగంట తర్వాత చల్లని నీటితో కడిగితే ముడతలు ,నల్ల మచ్చలు తొలగి పోతాయి.


పచ్చి శనగపప్పు రాత్రంతా పాలల్లో నానబెట్టి ఉదయం రుబ్బి అందులో చిటికెడు పసుపు కలిపి ముఖానికి రాసి ఆరిన తర్వాత మంచినీటితో కడిగితే ముఖం కాంతి వంతమవుతుంది.


అర టీ స్పూన్‌ నిమ్మరసంలో కొద్దిగా గంధం తీసుకుని పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇందులో బొప్పాయి గుజ్జుని కలపాలి. వేళ్లతో ఈ మిశ్రమాన్ని తీసుకుని ముఖంపై వలయాకారంలో సుతిమెత్తగా మర్దనా చేయాలి. ఇది స్క్రబ్‌లా ఉపయోగపడడమే కాకుండా, చర్మకాంతిని కూడా మెరుగు పరుస్తుంది.


పెరుగు, గోరింటాకు, గుడ్డు తెల్లసొన కలిపి రాత్రంతా నాననిచ్చి ఉదయాన తలకు పట్టించి ఆరిన తర్వాత కుంకుడుగాయ రసంతో తలస్నానం చేస్తే ఎంతటి మొండి చుండ్రయినా మాయం కావాల్సిందే. అలాగే వేపాకు వేసి కాచిన నీటితో తలస్నానం చేస్తే చుండ్రు మటుమాయం.


పేల సమస్య బాధితులు తలస్నానం చేసిన తర్వాత జుట్టు తుడుచుకొని సాంబ్రాణి పొగ వేస్తే పేల సమస్య వదిలిపోతుంది.


నిర్జీవంగా మారి రాలుతున్న జుట్టుకు ఎండు సీతాఫలం గింజల పొడి కలిపిన కొబ్బరి నూనె రాస్తుంటే జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది.


కాలుష్యం బారిన పడిన జుట్టు తిరిగి మెరవాలంటే క్యాబేజి ఆకు రసాన్ని మాడు, జుట్టుకు పట్టించి ఆరిన తర్వాత తలస్నానం చేస్తే జుట్టు బాగా పెరగటమే గాక మెరుస్తుంది.


నల్లని జుట్టు కోరేవారు నిమ్మరసం, తులసి, కరివేపాకు కలిపి నూరి తలకు రాస్తే మంచి గుణం కనిపిస్తుంది.


చిన్న వయసులో జుట్టు నెరిసిన వారు ఆహారంలో తరచూ పాలకూర తీసుకొంటే జుట్టు నెరుపు తగ్గుతుంది.

No comments

Post Top Ad

Post Bottom Ad