Header Ads

నీలిచిత్రాలు ఎక్కువగా చూసే పురుషుల్లో అతిప్రవర్తనలు రావచ్చా?

కొంతవరకూ నిజమే. లైంగిక సమస్యలకు, ముఖ్యంగా వైఫల్యాలకు నీలిచిత్రాలు ఎక్కువగా చూడటం (పోర్నోగ్రఫీ) కూడా ఒక ముఖ్య కారణం. పురుషుల్లో ఈ సమస్య చాలా ఎక్కువ, స్త్రీలలో కొంత తక్కువ. ముఖ్యంగా స్త్రీలు ఈ చిత్రాల్లో చూపించేవన్నీ నిజాలేననీ, మిగతా  పురుషులంతా ఈ చిత్రాల్లో చూపిస్తున్నంత దృఢంగా ఉంటారనీ, తమ భర్తలే ఎందుకూ కొరగాకుండా ఉన్నారని నమ్మటం మొదలుపెడితే పరిస్థితి సమస్యాత్మకంగా   తయారవుతుంది. 

After fights with my husband, we always go to bed angry. Our ...

అలాగే పురుషులు కూడా వీటిని చూసి భార్యలతో లేదా భాగస్వాములతో రకరకాల ప్రయోగాలకు దిగితే ఇబ్బందే. చాలాసార్లు స్త్రీలు వీటికి అంగీకరించకపోవచ్చు. భాగస్వామి ఒత్తిడి భరించలేక ఒప్పుకున్నా అందులో తృప్తి పొందలేక రకరకాల మానసిక రుగ్మతల్లో చిక్కుకోవచ్చు. నీలిచిత్రాల వల్ల భావోద్వేగాల పరంగా చాలా ఇబ్బందులు రావచ్చు. అయితే ఇవన్నీ అందరి విషయంలో ఇలాగే జరిగి తీరతాయని చెప్పలేంగానీ వీటితో ఈ రకం ముప్పు మాత్రం కచ్చితంగా ఉంటుంది.

Post Top Ad

Post Bottom Ad