Header Ads

కరివేపాకు అద్భుత ప్రయోజనాలు తెలిస్తే..

భార‌తీయులు పురాత‌న కాలం నుంచి క‌రివేపాకును వంటల్లో ఉప‌యోగిస్తున్నారు. దీని చ‌క్క‌ని సువాస‌న‌ కారణంగా కూరైనా, సాంబారైనా, ఉప్మా, రసం దేనిలోనైనా కరివేపాకు వేస్తే వచ్చే రుచే డిఫరెంట్‌గా ఉంటుంది. కరివేపాకే కదా’ అంటూ చిన్నచూపు చూసేవారు ఇప్పుడు ఆలోచించక తప్పదు. కరివేపాకు మంచిదని అందరికీ తెలుసు. కానీ, ఇష్టంలేకో లేక అలవాటులేకనో ఏరి పారేస్తారు. కానీ కరివేపాకు వల్ల వచ్చే లాభాలు తెలిస్తే మాత్రం చక్కగా నమిలేస్తారు. క‌రివేపాకును ప‌లు ఆయుర్వేద ఔష‌ధాల త‌యారీలోనూ వాడుతారు.

క‌రివేపాకుతో కలిగే అద్భుత ప్రయోజనాలు తెలిస్తే అస్సలు పడేయరు | Amazing  Health Benefits Of CurryLeaves - YouTube

కరివేపాకులో విట‌మిన్లు ఎ, బి, సి, బి2ల‌తోపాటు కాల్షియం, ప్రోటీన్లు, అమైనో యాసిడ్లు, ఫాస్ఫ‌ర‌స్‌, ఫైబ‌ర్‌, ఐర‌న్ వంటి పోష‌కాలు పుష్క‌లంగా ఉంటాయి. క‌రివేపాకుల‌ను నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి. క‌రివేపాకుల్లో ఆల్క‌లాయిడ్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మ‌న శ‌రీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ ను త‌గ్గించ‌డంలో క‌రివేపాకులు అమోఘంగా ప‌నిచేస్తాయి. క‌రివేపాకులు తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను అంతం చేసి శ‌రీరానికి న‌ష్టం క‌ల‌గ‌కుండా చూస్తాయి.

కరివేపాకు కషాయం ఉపయోగాలు | Curry Tree ...

కాలిన గాయ‌లు, పుండ్లు, దెబ్బ‌ల‌ను త్వ‌ర‌గా మాన్పించేందుకు క‌రివేపాకులు బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు గాయాల‌ను త్వ‌ర‌గా మానుస్తాయి. ఇన్ఫెక్ష‌న్లు రాకుండా చూస్తాయి. జీర్ణశక్తిని పెంచడంలో కరివేపాకు గ్రేట్ గా సహాయపడుతుంది. కరివేపాకుతో తయారుచేసిన జ్యూస్ లో కొద్దిగా దాల్చిన చెక్క పొడి చేర్చి తాగడం వల్ల యూరినరీ సమస్యలు చాలా ఎఫెక్టివ్ గా తగ్గించుకోవచ్చు. కరివేపాకులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇది కళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది.

క‌రివేపాకుతో ఆ స‌మ‌స్య‌ల‌కు చెక్‌..


దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి.

No comments

Post Top Ad

Post Bottom Ad