Header Ads

తలనొప్పి తగ్గాలంటే ధనియాలతో ఇలా చేస్తే సరి…

Home Remedies For Headache In Telugu - -TeluguStop 

మనం నిత్యం చాలా రకాల దినుసులను వంటింట్లో వాడుతాము. అందులో ధనియాలు ఒకటి. ధనియాలు మన ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో మన శరీరానికి కావలసిన చాలా రకాల పోషకాలు ఉన్నాయి. కడుపులో మంట, కడుపులో నొప్పి, తలనొప్పి, గడబిడ, మలబద్ధకం వున్నవారు ధనియాల పొడిని మజ్జిగలో కలుపుకొని త్రాగితే ఇట్టే తగ్గిపోతుంది. నిద్రలేమితో బాధపడే వారు ధనియాల కషాయం చేసుకొని ఆ కషాయంలో కొద్దిగా పాలు కలుపుకొని తాగితే నిద్ర బాగా పడుతుంది.

Benefits of coriander seeds

ధనియాలు రోజూ తీసుకోవడం వల్ల చిన్న పిల్లలతో పాటు, స్త్రీలకు కూడా ఎక్కువగా మేలు చేస్తుంది. గర్భవతులు రోజూ తమ ఆహారంలో విధిగా ధనియాలు తీసుకోవడం వల్ల ముఖ్యంగా ప్రసవించిన సమయంలో గర్భకోశానికి ఎంతో మేలు కలుగుతుంది. ధనియాలు, జీలకర్ర, బెల్లం కలిపి నూరుకొని చిన్నచిన్న గుళికల్లా చేసుకొని మూడు పూటలా ఒక్కోటి వేసుకొంటే కీళ్ల నొప్పుల నుంచి విముక్తి కలుగుతుంది.

Benefits of Coriander | Weight loss, healthy skin and hair - What ...

అజీర్తి, పుల్లత్రేపులు, కడుపుబ్బరం గలవారికి ధనియాలు శుభ్రం చేసి కొద్దిగా ఉప్పు కలిపి దోరగా వేయించి మిక్సీలో వేసి పొడి చేసి రోజూ ఆ పొడి వాడుతుంటే నివారణ కల్గుతుంది. బియ్యం కడిగిన నీటిని కలిపి ధనియాలు మెత్తగా నూరి, ముద్ద చేసి దానికి పటికబెల్లం చేర్చి కొద్ది మోతాదుల్లో తింటే పిల్లలకు తరచూ వచ్చే దగ్గు, ఆయాసం మటుమాయమవుతుంది.

Coriander seeds (en)


దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి.

No comments

Post Top Ad

Post Bottom Ad