క్యారెట్ జ్యూస్ ఆరోగ్య ప్రయోజనాలు.
క్యారెట్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వీటిని దాదాపు అందరూ ఇష్టంగా తింటారు. వీటిని వంటలలో కంటే పచ్చిగానే తినడానికి ఇష్టపడతారు. కానీ కొంతమందికి మాత్రం క్యారట్స్ తినడానికి ఇష్టపడరు. ఎన్ని రకాలుగా చెప్పినా వీటిని తినరు. అలాంటప్పుడు జ్యూస్ రూపంలో క్యారట్స్ తీసుకుంటే అద్భుత ప్రయోజనాలు పొందవచ్చు. క్యారెట్ జీర్ణం కావడానికి సుమారు రెండున్నర గంటల సమయం పడుతుంది. రోజు క్యారెట్ తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ అల్సర్, జీర్ణశయ సంబంధ క్యాన్సర్ బారినపడకుండా ఉండవచ్చు. క్యారెట్లో పీచు పదార్ధం ఎక్కువుగా ఉండటం వల్ల మలబద్దకాన్ని నివారించేందుకు ఉపయోగపడుతుంది.
క్యారట్స్ ద్వారా విటమిన్ ఏ పుష్కలంగా పొందవచ్చు. విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి, కంటి చూపు మెరుగవడానికి సహాయపడుతుంది. ప్రతిరోజు రాత్రి ఒక కప్పు క్యారెట్ రసంలో ఒక గ్లాసు పాలు, కొద్దిగా తేనె కలిపి పది బాదం పప్పులతో పాటు తీసుకుంటే మానసికంగా శ్రమపడే వారికి ఎంతో ఉపయోగపడటమే కాకుండా ఆలోచనాశక్తి, జ్ఞాపకశక్తి పెంపొందుతుంది. మూడు వారాల పాటు ఖచ్చితంగా క్యారట్ జ్యూస్ తాగడం వల్ల ఆడవాళ్లలో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ని తగ్గిస్తాయి. పచ్చి క్యారెట్ ను తినడం వల్ల నులిపురుగు లాంటి సమస్యలు తొలగడంతో పాటు, రక్తం శుభ్రపడుతుంది.
మూత్రశయం, మూత్రపిండాలలో రాళ్లు ఉన్నవారు మిగతా మందులతో పాటు క్యారెట్‌ను సేవిస్తే ఇందులోని కెరోటిన్ అనే పదార్థం శీఘ్ర గుణకారిగా ఉపయోగపడుతుంది. అంతేకాక మళ్లీ రాళ్లు తయారుకాకుండా నిరోధిస్తుంది. స్మోకింగ్ చేసేవాళ్లలో వచ్చే రకరకాల క్యాన్సర్ల రిస్క్ ని తగ్గించడానికి క్యారట్ జ్యూస్ సహాయపడుతుంది. క్యారట్ జ్యూస్ ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల గుండె కొట్టుకున్నప్పుడు గుండె ఎదుర్కొనే సమస్యలతో పోరాడే శక్తిని పొందవచ్చు. క్యారట్ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్స్, పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మం, జుట్టు న్యాచురల్ గ్లో పొందడానికి సహాయపడుతుంది.
దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి.
No comments