కిస్‌మిస్ ఉపయోగాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
కిస్‌మిస్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి మనకు సంవత్సరమంతా లభిస్తాయి. అందువల్ల వీటిని మనం ఎప్పుడూ తినవచ్చు. వీటిని తింటే ఫ్యాట్, కొలెస్ట్రాల్ సమస్య కూడా ఉండదు. కిస్‌మిస్‌లో ఫైబర్ ఎక్కువ. ఇవి మలబద్ధకాన్ని నివారించి, తిన్న ఆహారం బాగా జీర్ణమయ్యేలా చేస్తాయి. పేగులు, పొట్టలో విష వ్యర్థాల్ని తరిమికొడతాయి. అందువల్ల బయటకు కనిపించని పొట్టను శుభ్రం చేసుకోవాలంటే కిస్‌మిస్ తినడం అవసరం.
కిస్‌మిస్ లోని యాంటీఆక్సిడెంట్లు కేన్సర్ అంతు చూస్తాయి. చర్మకణాల్లోకి రాబోతున్న వైరస్‌ను ఆపేసి బయటకు పంపేస్తాయి. కాన్సర్ కణాల వృద్ధి, పుండ్ల పెరుగుదల వంటి వాటిని కూడా ఇవి అడ్డుకుంటాయి. కిస్‌మిస్‌లో విటమిన్స్, మినరల్స్ వంటి పోషకాలుంటాయి. అంతేకాదు ఐరన్, పొటాషియం, కాపర్, మెగ్నీషియం ఉంటాయి. ఇవి పొట్టలో యాసిడ్ లెవెల్స్‌ను కంట్రోల్ చేస్తాయి. అందువల్ల అసిడిటీ లాంటి సమస్యలు తగ్గుతాయి.
కిస్‌మిస్‌లో సోడియం తక్కువగా ఉంటుంది. అలాగే ఇందులోని పొటాషియం కండరాలు, గుండె కండర కణాలకు మేలు చేస్తుంది. గుండెకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉండాలంటే… ఎండిన ద్రాక్షను రెగ్యులర్‌గా తింటూ ఉండాలి. కిస్‌మిస్‌లోని పాలీఫెనాల్స్ అనే యాంటీఆక్సిడెంట్ మన కళ్లను కాపాడుతుంది. కంటి సమస్యలకు చెక్ పెడుతుంది.
మిగతా డ్రైఫ్రూట్స్ కంటే వీటిలో ఫెనాల్ అనే పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల ఇవి చలికాలంలో తప్పనిసరిగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. కిస్‌మిస్ లో విటమిన్ సీ, సెలెనియం, జింక్ వంటివి ఉంటాయి. కాబట్టి ఇవి చర్మాన్ని కాపాడి యాంటీ ఏజింగ్ లా పని చేస్తాయి. చర్మం పాడవకుండా, చర్మ కణాలు దెబ్బతినకుండా చేసి ముసలి తనం త్వరగా రాకుండా చేస్తాయి.
దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి.
No comments