Header Ads

ప్రతిరోజూ పరగడుపున కలబంద గుజ్జు తింటే కలిగే లాభాలు..

కలబంద మనకు పరిచయం అవసరం లేని మొక్క. మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక రకాల ఔష‌ధ మొక్క‌ల్లో క‌ల‌బంద కూడా ఒక‌టి. దీని ఆకుల్లో ఉండే గుజ్జును ప్ర‌స్తుతం అనేక ర‌కాల కాస్మొటిక్స్, మందుల త‌యారీలో ఉప‌యోగిస్తున్నారు. ఇది చేసే మేలు అంతా.. ఇంతా.. కాదు. అందుకే కలబందను సర్వరోగ నివారిణి అంటారు. క‌ల‌బంద‌కు ప్ర‌స్తుతం మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. అయితే క‌ల‌బంద గుజ్జును మ‌నం రోజూ పరగడుపున తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

Health Benefits of Aloe Vera | health news | Kayawell

కలబంద మొక్క ఒక్కటి ఇంట్లో ఉంటే ...

కలబంద గుజ్జును రోజూ ఓ స్పూన్ తీసుకుంటే..డయాబెటీస్ దూరం అవుతుంది. రాత్రి పూట కలబంద గుజ్జును తీసుకుంటే అజీర్తి వుండదు. గ్యాస్‌, అసిడిటీ, అజీర్తి స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. క‌లబంద గుజ్జులో యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల ఆ గుజ్జును తింటే మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అలాగే వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి.

health benefits of eating aloe vera in the morning

ప‌ర‌గ‌డుపునే క‌ల‌బంద గుజ్జును తింటే జీర్ణాశ‌యంలో ఉండే సూక్ష్మ క్రిముల‌న్నీ న‌శిస్తాయి. జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. రోగ నిరోధక శక్తి పెంచి షుగరు, మలబద్ధకాన్ని నిరోధించి అల్సర్‌ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వైద్య పరంగా చూస్తే కలబందలోని మెగ్నీషియం లాక్టెట్‌, వ్యాధుల నివారణకు, కీటకాలు కుట్టినపుడు కలిగే బాధకు నివారిణిగా పని చేస్తుంది. కేన్సర్‌ వ్యాధి నివారణకు ఇది దివ్యౌషధం.

Aloe vera: Eight health benefits


దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి.

No comments

Post Top Ad

Post Bottom Ad