గుడ్డు ఎందుకు తినాలో తెలుసా ?
కోడిగుడ్డు మన ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ చాలా మంది ఉడికించిన గుడ్డు తినడానికి ఇష్టపడరు. కానీ ఉడికించిన గుడ్డు మన ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాలు కోడిగుడ్డులో ఉంటాయి. గుడ్లను తినడం వల్ల మన శరీరానికి సరైన పోషణ అందుతుంది.
కొవ్వును కరిగించే విటమిన్లు గుడ్డులో పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. విటమిన్ ఎ చాలా ముఖ్యమైన పోషకాహారం. ఆరోగ్యవంతమైన వ్యక్తులు రోజుకు 2 కోడిగుడ్లను తినవచ్చు. డయాబెటిస్, గుండె జబ్బులు ఉన్నవారు, అధికంగా బరువున్నవారు రోజుకు 1 గుడ్డు మాత్రమే తినాలి. రెండో గుడ్డు తినాలనుకుంటే మాత్రం గుడ్డు లోపలి పచ్చ సొన తీసేసి తినాలి.
గుడ్డులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. విటమిన్ డి గ్రహించడానికి క్యాల్షియం చాలా అవసరం అవుతుంది. గుడ్డులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అదనంగా విటమిన్ డి, విటమిన్ బి 12 మరియు విటమిన్ బి 2 వంటి విటమిన్లను కూడా అందిస్తాయి. గుడ్డు గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. గుండె సమస్యలు మరియు ఆరోగ్య సమస్యలతో బిడ్డ పుట్టకుండా కాపాడటానికి గుడ్లు సహాయపడతాయి.
అంతేకాదు కోడిగుడ్డు గర్భిణీ మహిళలకు చాలా మంచిది. ఎందుకంటే బేబీ బ్రెయిన్ డెవలప్ మెంట్ కు గుడ్డు మంచిది. శిశువులలో సంభవించే నాడీ సంబంధిత సమస్యలను నివారించడం చాలా అవసరం. అందుకోసం గుడ్లు గొప్పగా సహాయపడుతాయి. గుడ్లలో ఖనిజాలు, కోలిన్ మరియు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లల మెదడు అభివృద్ధికి సహాయపడుతాయి.
దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి.
No comments