Header Ads

వంట దినుసులతో ఆరోగ్యం పదిలం.

మన భారతీయుల వంటకాల్లో చాలా రకాల వంట దినుసులు వాడుతాము. వంటకాలకు మంచి రుచిని, కమ్మని సువాసనను ఇచ్చే దినుసులు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయంటున్నారు పోషకాహార నిపుణులు. ఏ దినుసులు వల్ల ఏ ఏ ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

15 Indian Spices And Their Amazing Health Benefits - Boldsky.com
 
ధనియాలలో విటమిన్ ఎ, విటమిన్ బి2, విటమిన్ డి, ఇనుము పుష్కలంగా లభిస్తాయి. వంటల్లో ధనియాల వినియోగం వల్ల కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు, గ్యాస్‌ సమస్యలు రావు. రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. జ్వరం తగ్గిన తర్వాత 2 రోజులపాటు ధనియాలతో కాచిన రసం తాగితే నీరసం తగ్గటమే గాక జీర్ణశక్తి మెరుగుపడుతుంది.

ఇనుము పుష్కలంగా లభించే జీలకర్రను రోజూ వాడటం వల్ల రోగనిరోధక శక్తి, జీర్ణశక్తి పెరుగుతుంది. రక్తవిరేచనాలకు జీలకర్ర రసం వాడితే మంచి గుణం కనిపిస్తుంది.

health benefits of indian spices

పసుపు మంచి యాంటీ బయోటిక్. రోజువారీ వంటకాల్లో పసుపు వాడితే మధుమేహం అదుపులో ఉంటుంది. క్యాన్సర్‌ కారకాలను నిరోధించటమే గాక నొప్పులు, వాపులను తగ్గించే గుణం పసుపుకు ఉంది. పసుపును నీళ్లలో కలుపుకుని తాగితే ఎసిడిటీ సమస్య దూరం అవుతుంది. అజీర్తిని తగ్గించటంతో బాటు రక్తశుద్ధికి ఇది దోహదపడుతుంది.

పీచు పుష్కలంగా లభించే మెంతుల వినియోగంతో జీవక్రియలు పుంజుకుంటాయి. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. రోజూ మెంతులు తినేవారికి మధుమేహం, థైరాయిడ్ సంబంధిత ఇబ్బందులు ఉండవు. రక్తశుద్ధితో బాటు చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. మెంతుల వినియోగంతో బిడ్డకు సరిపడా చనుబాలు పడతాయి.

Aromatic Indian spices. stock photo. Image of ingredients - 108193814

శ్వాసకోశ వ్యాధుల నివారణ, శ్వాశకోశ పనితీరుకు దోహదపడే అత్యుత్తమమైన దినుసు వాము. తీవ్రమైన ఒళ్లు నొప్పులు ఉన్నప్పుడు వేడి చేసిన కొబ్బరినూనెలో వాము కలిపి శరీరానికి బాగా మర్దన చేయటం వల్ల మంచిగుణం కనిపిస్తుంది. కానీ వామును పరిమితంగా వాడటం మంచిది.

మధుమేహాన్ని అదుపులో ఉంచేందుకు దాల్చిన చెక్క వినియోగం దోహదపడుతుంది. వాంతి అయ్యేలా ఉన్నప్పుడు దాల్చిన చెక్కను తింటే ఇబ్బంది తొలగిపోతుంది. దంత, చిగుళ్ల సమస్య ఉన్నవారు దాల్చిన చెక్క పొడితో నోరు శుభ్రం చేసుకోవటం మంచిది.

Health Benefits of Spices | Dr. Sears Wellness Institute

ఏ వంటకానికైనా కమ్మని సువాసనను తెచ్చే యాలకుల వినియోగంతో మానసిక ఒత్తిళ్లు దూరమవుతాయి. నోటి దుర్వాసన, చిగుళ్ల ఇన్ఫెక్షన్, దంత సంబంధిత సమస్యల నివారణకు, జీర్ణశక్తి పెరిగేందుకు యాలకుల వినియోగం దోహదపడుతుంది. తలనొప్పిగా ఉన్నప్పుడు ఒక కప్పు ఏలకుల టీ తాగితే మంచి ఫలితం ఉంటుంది.

లవంగం నూనె పంటినొప్పికి అత్యుత్తమ ఔషధంగా పనిచేస్తుంది. జలుబు, గొంతు గరగర, పొడిదగ్గు ఉన్నప్పుడు లవంగాలు చప్పరిస్తే మంచిది. ఆస్తమా బాధితులు లవంగాలు వేసి కాచిన నీళ్లు తాగితే శ్వాస సమస్య దూరమవుతుంది.

Spices Wallpapers >> Backgrounds With Quality HD Desktop Background

రోజువారీ వంటకాల్లో ఆవాలు వాడితే ఇనుము, జింక్‌, క్యాల్షియం, ప్రొటీన్లు పుష్కలంగా లభించినట్లే. ఆవాల్లోని ఒమెగా ఫ్యాటీ ఆమ్లాలు చెడు కొలెస్ట్రాల్‌ని నివారించి హృదయారోగ్యాన్ని కాపాడుతాయి. అయితే ఆవాలను మితంగా వాడటం మంచిది.

మిరియాలు చలివాతావరణంలో వచ్చే అనారోగ్యాలను దరిజేరనీయకుండా చూస్తాయి. పొడిదగ్గు, జలుబుకు మిరియాలు మంచి ఔషధమనే చెప్పాలి. జీర్ణశక్తీ బాగుంటుంది.

The Medicinal Benefits Of India's Favourite Spices

ఇంగువ చేసే మేలు అంతాఇంతా కాదు. వంటకాల్లో ఇంగువ వాడితే గ్యాస్‌ సమస్యలు, జీర్ణ సమస్యలు రావు. కడుపునొప్పి, ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌, నరాల బలహీనత వంటి సమస్యలు కూడా ఇంగువ వినియోగంతో దూరమవుతాయి.


దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి.

No comments

Post Top Ad

Post Bottom Ad