Header Ads

ర‌క్త‌హీన‌తను నిర్ల‌క్ష్యం చేస్తే సమస్యలు తప్పవు..

శ‌ర‌రీంలో ర‌క్తం త‌గ్గితే దీర్ఘ‌కాలంలో ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుందని సైంటిస్టుల అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది. ర‌క్తం త‌క్కువ‌గా ఉంది అంటే.. రోగాల‌కు ఆహ్వానం ప‌లుకుతున్న‌ట్లే.. రక్తం ఉండాల్సిన దాని క‌న్నా త‌క్కువ‌గా ఉంటే చాలా ప్రమాదం. కొంతమంది దీనిని ఏమీ కాదులే అని నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఇది కరెక్ట్ కాదు. మ‌హిళ‌లు, చిన్నారులు, శారీర‌క శ్ర‌మ ఎక్కువ‌గా చేసేవారు, స‌ర్జ‌రీలు అయిన వారు శ‌రీరంలో ర‌క్తం ఎక్కువ‌గా ఉండేలా చూసుకోక‌పోతే ఇబ్బందులు వ‌స్తాయి. అందుకుగాను ప‌లు ఆహారాల‌ను నిత్యం తీసుకుంటే శ‌రీరంలో ర‌క్తం బాగా త‌యార‌వుతుంది. మ‌రి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

రక్త హీనతను దూరం చేసే పవర్ ఫుల్ ఫుడ్స్ ఇవే...

బెల్లం :

చాలామంది ఇంట్లో బెల్లం ఉన్నా కూడా అంతగా పట్టించుకోరు. కానీ ఇందులో ఐర‌న్‌తోపాటు ప‌లు విట‌మిన్లు పుష్క‌లంగా ఉంటాయి. దీనిని తరచుగా తిన‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు తగ్గుతాయి. జ‌లుబు త‌గ్గుతుంది. శరీరంలో రక్తం బాగా త‌యార‌వుతుంది. నిత్యం భోజ‌నం చేశాక ఒక బెల్లం ముక్క‌ను తింటే ఐర‌న్ బాగా ల‌భిస్తుంది. దీంతో ర‌క్త‌హీన‌త లేకుండా ఉంటుంది.

కండరాల శక్తికి బెల్లం ముక్క

నట్స్ :

వీటిల్లో ఐర‌న్ పుష్క‌లంగా ఉంటుంది. మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే అనేక పోషకాలు వీటిలో ఉంటాయి. నిత్యం గుప్పెడు నట్స్ తీసుకుంటే శ‌రీరంలో ఐర‌న్ పెరిగి ర‌క్తం ఎక్కువ‌గా త‌యార‌వుతుంది. వీటిని సాయంత్రం పూట స్నాక్స్ రూపంలో తీసుకున్నా చాలు.. ర‌క్తం బాగా త‌యార‌వుతుంది.

The health benefits of nuts - BBC Good Food

దానిమ్మ‌పండ్లు :

శీతాకాలంలో తీసుకోవాల్సిన ఉత్తమ ...

దానిమ్మ పండ్ల‌లో ఐర‌న్ పుష్క‌లంగా ఉంటుంది. అలాగే కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం, ఇత‌ర విట‌మిన్లు ఉంటాయి. ఇవ‌న్నీ ర‌క్తాన్ని పెంచుతాయి. నిత్యం దానిమ్మ పండ్ల‌ను తిన‌డం ద్వారా లేదా ఆ పండు జ్యూస్‌ను తాగ‌డం వ‌ల్ల ర‌క్తాన్ని పెంచుకోవ‌చ్చు.

దానిమ్మపండు యొక్క అద్భుత ఆరోగ్య రహస్యాలు!

పాల‌కూర :

పాల‌కూర తింటే కిడ్నీలో రాళ్లు వ‌స్తాయ‌ని అనుకుంటారు. కానీ దీన్ని నిత్యం తినాల్సిన ప‌నిలేదు. అప్పుడ‌ప్పుడు తిన్నా చాలు. దీంతో అనేక పోష‌కాలు ల‌భిస్తాయి. ముఖ్యంగా ఐర‌న్ ఎక్కువ‌గా ల‌భిస్తుంది. దీంతో శ‌రీరంలో ర‌క్తం ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతుంది.

bachhali: health benefits of bachhali kura (malabar spinach) | Samayam  Telugu Photogallery 

do not neglect anemia eat these daily


దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి.

No comments

Post Top Ad

Post Bottom Ad