నీలిచిత్రాలను స్త్రీలు ఏవగించుకుంటారా? బ్లూఫిల్మ్‌లు వారికి నచ్చవా?
పురుషులతో పోలిస్తే స్త్రీలకు నీలిచిత్రాల పట్ల ఆసక్తి కొంత తక్కువనే చెప్పాలి. నీలిచిత్రాల్లో చూపించేవి అభూతకల్పలన్న వాస్తవం పురుషులకంటే స్త్రీలకు బాగా తెలియటం కూడా దీనికి ఒక కారణం కావచ్చు. ఈ చిత్రాల్లో చూపించే 'పోర్న్ స్టార్'లను చూసి, వాళ్లు చూపించేవి, వాళ్లు చేసేవన్నీ నిజాలేనని నమ్మటానికి పురుషులు ఇష్టపడుతుంటారు. పెద్ద పెద్ద రొమ్ములు, గంటల తరబడి సంభోగంలో పాల్గొంటూ పెద్దపెద్దగా మూలుగుతుండటం, గంటల తరబడి అంగచూషణం, పురుషాంగాన్ని ఎక్కడెక్కడో పెడుతూ రకరకాల ప్రయోగాలు చేస్తుండటం..
ఇలాంటి దృశ్యాలన్నీ పురుషులకు ప్రేరకాలుగా అనిపించొచ్చేమోగానీ ఈ తరహా వ్యవహారాలు స్త్రీలను ఏమంత ఉత్సాహపరచవు. ఇదంతా చాలా వరకూ పురుషుల ఫాంటసీ ప్రపంచం. బయట విరివిగా లభ్యమయ్యే చాలా నీలిచిత్రాల్లో ఇవే ఉంటాయి. ఇటువంటి అతిచేష్టలు కాకుండా.. సున్నితంగా, హృద్యంగా, అందంగా సాగే నీలి/శృంగార చిత్రాలు స్త్రీలకూ బాగానే గిలిగింతలు పెట్టొచ్చు.