వయగ్రా మహిళలో కామేచ్చనిస్తుందా?
వయగ్రా మహిళలో కామేచ్చనిస్తుందా? ఇవ్వదు .
పురుషులలో సెక్స్ ప్రక్రియ అనే చక్రం నాలుగు అంశాలపై ఆధారపడి వుంటుంది. అవి
1.సెక్స్ కోరిక , 2.అంగ స్థంబన , 3.అంగప్రవేశము , 4.భావప్రాప్తి .
మహిళలలో ఆ చక్రము 1.సెక్స్ కోరిక ,2.స్నిగ్ధత ,3.అంగప్రవేశము ,4.భావప్రాప్తి . . తో పూర్తవుతుంది.
వయాగ్రాలో " సిల్డెనాఫిల్ సిట్రేట్ " అనే రసాయనము ఉంటుంది. దీనిలో సెక్స్ కోరిక పెంచే పాత్ర లేదు .అంగము గట్టిపడడము , అంగ స్థంభనలకు సహాయపడుతుంది. ఒక సారి ఎరెక్షన్ అయితే దానిని అలాగే కొంత సమయము ఉంచుతుంది. పురుషులలో 20% ఉండే ఎరెక్షన్ ను 80% - 90% కి పెంచుతుంది. ఎరెక్షన్ అసలే లేనివారికి వయాగ్రా ఉపయోగము ఉండదు. ఆర్గాజం లో వయాగ్రా ప్రాత్ర ఉండదు .
మహిళలు వయాగ్రా నినియోగిస్తే సెక్స్ కోరిక పెరగడము , లూబ్రికేషన్ బాగా కావడము జరుగవు . ఆర్గాజము వల్ల కలిగే సుఖము లో కూడా మార్పు రాదు . కావున మహిళలు వయాగ్రా వినియోగించినా సెక్స్ విషయము లో ఏమీ ప్రయోజనము ఉండదు.