Header Ads

ఎండు ద్రాక్షలను కప్పు నీటిలో రాత్రిపూట నానబెట్టి...?

ఎండు ద్రాక్షలను కప్పు నీటిలో రాత్రిపూట నానబెట్టి...?


dry grapes


ఎండుద్రాక్షలలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఎండుద్రాక్షల్లో ఉండే పొటాషియం అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. వీటిల్లో పీచు అధికంగా ఉంటుంది. వీటిని రోజూ ఏదో ఒక సమయంలో తీసుకుంటే... అజీర్తి నియంత్రణలో ఉంటుంది. దీంతోపాటు అధికబరువుకు దూరంగా ఉండొచ్ఛు ఇవి జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

అలాగే వ్యాధినిరోధక శక్తిని అందించే విటమిన్‌ బి, సి ఉండే ఎండుద్రాక్షకు సత్వర శక్తినిచ్చే గుణాలు మెండుగా ఉన్నాయి. ఐరన్‌, పొటాషియం, క్యాల్షియం వంటి పోషకాలు నిండుగా ఉండే వీటిని రోజూ తీసుకుంటే... శారీరక బలంతోపాటు, మానసిక శక్తినీ అందిస్తాయి. వేసవిలో ఎదురయ్యే అనారోగ్యాల నుంచి తేలికగా బయటపడొచ్ఛు ఇవి నోటి దుర్వాసననూ పోగొడతాయి. రక్తహీనత రాకుండా చూస్తాయి.

గుప్పెడు ఎండు ద్రాక్షలను కప్పు నీటిలో రాత్రిపూట నానబెట్టాలి. వీటిని మరుసటి రోజు ఉదయం పరగడుపున తీసుకుంటే... ఎండ తీవ్రత వల్ల కలిగే అలసటకు దూరంగా ఉండొచ్ఛు ఇందులో ఉండే క్యాల్షియం ఎముకలను బలోపేతం చేస్తుంది.

Post Top Ad

Post Bottom Ad