ప్రసాదం గురించి ప్రతి ఒక్కరు కచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని నిజాలు..
ప్రసాదం, ఈ పదం మనలో చాలా మందికి సుపరిచితమే.ఎందుకంటే కొంతమంది గుడికి దీని కోసం వెళ్తారు మరి.జస్ట్ జోకు లేండి.ఇక హిందు సంప్రదాయంలో దేవుడికి సమర్పించే నైవేద్యాన్ని భక్తులకు ప్రసాదం గా అందిస్తారు.మరి అలాంటి ప్రసాదం గురించి మనం తెలుసుకోవాల్సిన కొన్ని నిజాలేంటో ఇప్పుడు ఒక సారి చూద్దాం.
1.ప్రసాదం దైవభక్తిని పెంపొందించడంలో పాటు మానవుడిని యొక్క పవిత్రతను పెంచుతుంది.
2.ప్రసాదం నలుగురికి పంచడం వల్ల పక్క వారితో సత్సంబంధాలు మెరుగ్గా వుంటాయి.
3.ప్రసాదం ఇది పెట్టాలని రూల్ లేదు. చిన్నపండైనా ప్రసాదమే.
4.ప్రసాదం తినడం వల్ల దేవుడు మన బాధలు వింటాడు అనే భావన వుంది. నిజమో కాదో తెలియదు,నిజము అయితే మాత్రం మనకు మంచిదేగా.
5.ప్రసాదంగా తులసీ నీళ్ళును కూడా ఇవ్వవచ్చు.
6. ప్రసాదం తీసుకోవడం వల్ల చాలా రకమైన వ్యాధులు నయమైపోతాయని భావించే వాళ్ళు మనలో చాలా మంది వున్నారు.