Header Ads

అరటిపండ్లు తింటే బరువు పెరుగుతామా?

ముంబై లాంటి మహా నగరాల్లో భోజనం బదులు అరటిపండ్లను తిని సరిపెట్టుకుంటున్నవాళ్లు చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ వాళ్లకు ఎలాంటి అనారోగ్య సమస్యలూ రావట్లేదు. కారణం అరటి పండ్లు ఆరోగ్యాన్ని కాపాడటమే కాక, ఆకలి బాధలు తీరుస్తున్నాయి. మరి రెగ్యులర్‌గా అరటిని తింటే బరువు పెరుగుతామా? నిపుణులు ఏమంటున్నారు?

The trick to make bananas ripen faster

బరువు తగ్గాలనుకునేవాళ్లు, వెంటనే అరటిపండ్లు తినడం మానేస్తారు. ఎందుకంటే అరటిపండ్లను తింటే బరువు పెరుగుతామనే ఆలోచనే. నిజానికి బరువు తగ్గాలంటే, తీసుకునే ఆహారంలో తప్పనిసరిగా అరటిపండ్లు ఉండాలంటున్నారు డైట్ నిపుణులు. అరటిలో ఫైబర్, పొటాషియం, కార్బొహైడ్రేట్స్ పోషకాలతోపాటూ, విటమిన్ సీ, ఇతర ఖనిజాలుంటాయి. ఇండియాలో చాలా మంది టిఫిన్, బ్రేక్ ఫాస్ట్ కింద అరటిపండ్లనే తీసుకుంటారు. తిన్నవెంటనే ఎనర్జీ రావాలంటే, అందుకు అరటిపండ్లే బెస్ట్ ఆప్షన్. బరువు తక్కువగా ఉండేవాళ్లు, తమ డైట్‌లో అరటిపండ్లను చేర్చుకుంటే, బరువు పెరిగేందుకు వీలవుతుంది. అలాగని అరటిని తింటే బరువు పెరిగిపోతామని మాత్రం అనుకోవాల్సిన అవసరం లేదు. కారణం నిపుణులు చెబుతున్న అంశాలే.

అరటిలో పిండి పదార్థం ఎక్కువ. బరువును కంట్రోల్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. సరిపడా బరువు ఉండేలా చేస్తుంది. అరటిలోని పీచు పదార్థం మరింత ఆకలి వెయ్యకుండా చేస్తుంది. మైక్రోబయోటిక్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ ప్రాక్టీషనర్ శిల్ప అరోరా ప్రకారం, అరటిరలోని పీచు పదార్థాలు, బరువు తగ్గేందుకు సహాయపడతాయి. శరీరంలో వివిధ విభాగాలు చక్కగా పనిచేసేలా చేస్తాయి.



సాధారణంగా పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకున్నప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ తప్పుతాయి. అరటిపండ్ల విషయంలో అలా జరగదు. ఇవి షుగర్ లెవెల్స్‌ని సడెన్‌గా పెరిగేలా చెయ్యవు. పైగా వీటిలోని సూక్ష్మ పోషకాలు, శరీరం చక్కగా, చురుగ్గా పనిచేసేందుకు దోహదపడతాయి. ఆరోగ్యాన్ని కాపాడతాయి. డాక్టర్ అరోరా ప్రకారం భోజనం తర్వాత అరటిపండు తీసుకోవడం ఎంతో మంచిది. శ్రమతో కూడిన పని చేసే ముందు అరటి పండు తినడం ఎంతో మేలు చేస్తుందంటున్నారు అరోరా. అరటిలో ఉండే పొటాషియం, బీపీని కంట్రోల్‌లో ఉంచుతుంది. అలాగే ఎక్కువ మోతాదులో ఉండే మెగ్నీషియం, కాల్షియం, ఫోలేట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందువల్ల బరువు సంగతి మర్చిపోయి, అరటిపండ్లు తినాలంటున్నారు ఆరోగ్య రంగ నిపుణులు. కొంతమంది అరటిపండ్లను ఇతర పదార్థాలతో కలిపి తీసుకుంటారు. అలాంటి వాళ్ల, అరటితోపాటూ ఓట్స్ కలిపి తీసుకోవచ్చని సూచిస్తున్నారు. ఐతే డాక్టర్లు సూచిస్తున్నా, అరటిపండ్లు తినడం వల్ల బరువు పెరుగుతున్నామని భావించేవాళ్లు, డైట్ విషయంలో డాక్టర్‌ను సంప్రదించడం మేలు.

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి.

No comments

Post Top Ad

Post Bottom Ad