Header Ads

లవంగం నీటితో అద్భుత ఆరోగ్యం... ఇలా చెయ్యండి

Clove Water Health Benefits: లవంగం ఉండటానికి చిన్నదే ఉన్నా... దాంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా దంతాల్ని అది రక్షిస్తుంది. లవంగం నీటితో ప్రయోజనాలు తెలిస్తే... మీరు లవంగం లవర్స్ అయిపోతారు.

Clove Water: లవంగం నీటితో అద్భుత ఆరోగ్యం... ఇలా చెయ్యండి


లవంగం లేని ఇల్లంటూ ఉండదేమో. ఈ సుగంధ ద్రవ్యంలో ఎన్నో పోషకాలు. ప్రధానంగా దంతాలు, చిగుళ్ల సమస్యలకు లవంగాన్ని వాడుతారు. ఇంకా చాలా లాభాలున్నాయి. పండ్లలో ఉండే విటమిన్ C, K, ఫైబర్, మాంగనీస్, యాంటీఆక్సిడెంట్స్ వంటివి లవంగంలోనూ ఉంటాయి. మీరు తినే ఆహారంలో లవంగాన్ని తప్పనిసరిగా చేర్చుకోవడానికి చాలా కారణాలున్నాయి. మీరు తయారుచేసుకునే ఆహారం, వంటల్లో లవంగాన్ని మిస్సవకుండా చేర్చేయమంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఐతే... లవంగాన్ని మరీ ఎక్కువగా వాడినా ప్రమాదమే. మరీ అంత ఎక్కువగా మనం ఎక్కడ వాడతాం... కాబట్టి... లవంగం డ్రింకుతో ఆరోగ్యాన్ని పెంచుకోవడం ఎలాగో తెలుసుకుందాం.


లవంగాల్ని కూరలతోపాటూ... కాస్మొటిక్స్, ఫార్మాస్యూటికల్, వ్యవసాయ ఉత్పత్తుల్లో ఎక్కువగా వాడతారు. ఈ పువ్వుల వల్ల మన పళ్లు, చిగుళ్లు దెబ్బతినకుండా ఉంటాయి. లవంగాల్ని పొడిగా చేసి... దెబ్బతిన్న దంతం దగ్గరా, పాడైన చిగుళ్ల దగ్గరా పెట్టుకుంటే... మెల్లమెల్లగా అది మందులా పనిచేసి... నొప్పిని తగ్గించేస్తుంది. అందుకే టూత్‌పేస్ట్ తయారీలో లవంగాల్ని వాడుతుంటారు. వికారంగా ఉన్నప్పుడు నోట్లో రెండు లవంగాలు వేసుకుంటే చాలు. జలుబు, దగ్గు, పడిశం లాంటివి ఏడిపిస్తూ ఉంటే... నోట్లో ఓ లవంగం వేసుకొని... చప్పరించాలి. ఇలా రోజుకు ఐదారు లవంగాల్ని చప్పరిస్తే... ముక్కు సమస్యలు తొలగిపోతాయి.

లవంగాలు తలనొప్పిని తగ్గిస్తాయి, బీపీని కంట్రోల్‌ చేస్తాయి, షుగల్ లెవెల్స్ సెట్ చేస్తాయి. లివర్, స్కిన్ సమస్యల్ని తగ్గిస్తాయి. అంతేకాదు... లవంగాల్లో యూజెనాల్ అనే నూనె ఉంటుంది. అది నొప్పి, వాపు, మంటల్ని ఇవి తగ్గిస్తుంది. పొట్టలో అల్సర్ సమస్యలకు కూడా లవంగాలు విరుగుడుగా పనిచేస్తాయి. లవంగాలు కేన్సర్ అంతు చూస్తాయి కూడా. కేన్సర్ కణాలు పెరగకుండా, వృద్ధి చెందకుండా లవంగాలు అడ్డుకుంటాయని పరిశోధనల్లో తేలింది. బరువు తగ్గడానికి కూడా ఇవి సహకరిస్తాయి. మన శరీర ఎముకలు బలంగా ఉండాలంటే లవంగాలు తినాలి. వాటిలోని మాంగనీసు మన ఎముకలకు అవసరం అవుతుంది. బోన్స్ బలంగా ఉండేందుకు లవంగాల్లోని యూజెనాల్ నూనె చక్కగా పనిచేస్తుంది.



లవంగం నీటితో ప్రయోజనాలు :లవంగం నీరు జీర్ణక్రియను పెంచుతాయి. అలాగే శరీర అధిక బరువును తగ్గిస్తాయి. శరీరంలో వేడిని తగ్గించడంలోనూ సాయపడతాయి. చాలామంది త్వరగా బరువు తగ్గేందుకు లవంగం నీటిని తాగుతారు. రాత్రి గ్లాసు నీటిలో రెండు లవంగాల్ని వేసి... తెల్లారి వరకూ నానబెట్టాలి. ఉదయం అన్నింటికంటే ముందుగా ఈ నీటిని తాగి... లవంగాల్ని చప్పరించేస్తే సరిపోతుంది.


బరువు తగ్గాలంటే... లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్రను వాడితే సరి. ఈ మూడింటినీ రోస్ట్ (వేపి) చేసి, పౌడర్ చెయ్యాలి. ప్రతీ రోజూ ఉదయం వేళ ఈ పొడిని ఓ టేబుల్ స్పూన్ తీసుకొని... ఓ గ్లాస్ నీటిలో వేసి ఉడకబెట్టాలి. ఉడికిన తర్వాత చల్లబరచాలి. ఈ డ్రింకులో టేస్ట్ కోసం కాస్త తేనె వేసి తాగితే... శరీరంలో అదనపు బరువు ఈజీగా తగ్గిపోతుంది.

లవంగం టీ ప్యాకెట్లు కూడా మార్కెట్లలో దొరుకుతాయి. రోజుకు రెండుసార్లు లవంగం టీ తాగితే మేలే. ఐతే... టేస్ట్ బాగుంది కదా అని ఎక్కువగా మాత్రం లవంగం టీ తాగకూడదు.

లవంగం నీరు తాగేటప్పుడు మీకు ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం తాగకపోవడమే మేలు. ఎందుకంటే... లవంగం నీరు కొంత మందికి పడదు. ఏదో అనీజీగా అనిపిస్తుంది. అలాంటివారు ఇతర ఆరోగ్య సూత్రాలు పాటించడం మేలు.


దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి.

No comments

Post Top Ad

Post Bottom Ad