రోజూ ఇలా చేస్తే ఇమ్యూనిటీ దానంతట అదే పెరుగుతుంది..
ప్రజెంట్ ఇమ్యూనిటీ అనేది చాలా ముఖ్యం. దీనిని పెంచుకోవాలంటే రోజూ ఏం చేయాలో తెలుసుకోండి..
మీరు ఉదయం మీ రోజును ఎలా ప్రారంభిస్తారు. ఇది మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మరియు మూడ్ ని నిర్ణయిస్తుంది. ఈ రోజుల్లో అందరి ఆలోచన రోగనిరోధక శక్తిని పెంచుకోవడం వైపే ఉంది. ఆరోగ్యకరమైన రోగనిరోధక శక్తి మన శరీరాన్ని కవచంలా కాపాడుతుంది. అంతే కాకుండా సీజనల్ వ్యాధుల నుండి మరియు అంటు రోగాలనుండి మన శరీరాన్ని కాపాడుతుంది.
ఇప్పుడు ఉన్న వైరస్ పరిస్థితుల్లో శరీరాన్ని రక్షించడం చాలా ముఖ్యమైనది.
నిపుణుల ప్రకారం రోగనిరోధక శక్తి ఒక రోజులో తయారుకాదు. మీ జీవనశైలిలో కొన్ని మార్పులు చేయడం, రోజు ప్రాథమిక దినచర్య చెయ్యడం, పోషకమైన ఆహారాన్ని తినడం మరియు ఫిజికల్ యాక్టీవిటీ చెయ్యడం ద్వారా రోగ నిరోధక శక్తి చురుగ్గా ఉంటుంది. రోజూ యాక్టీవ్, ఎక్కువ పనులు జరగాలి అనుకునే వాళ్ళకి ఆరోగ్యకరమైన ఉదయపు దినచర్య అవసరం. ఈ ఐదు రకాల సులభమైన దినచర్యను పాటించాలని చెబుతున్నారు..
ధ్యానం:
మీరు నిద్ర లేచిన వెంటనే, మీ మంచం మీద కూర్చున్నపుడు బాలసనా లేదా ‘చైల్డ్ పోజ్’ వేయండి. ఈ ఆసనం ఎంత ఎక్కువ సేపు చేయగలిగితే అంత సేపు అలానే పొజిషన్ లో ఉండండి. ఈ యోగ ఆసనం మీ కండరాల మధ్య స్టిఫ్ నెస్ ని తగిస్తుంది. అలాగే మెదడుకు రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది.
తరువాత నిటారుగా కూర్చుని ధ్యానం చెయ్యండి లేక శ్వాసకి సంభందించిన ఎక్సర్‌సైజ్ చేయండి. ఇలా చేయడం వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. రాత్రి నిద్ర తర్వాత బాడీ పనితీరు మెరుగు పడటానికి ఉపయోగపడుతుంది.
ఆయిల్ పుల్లింగ్ :
ఇది పురాతన ఆయుర్వేద పద్ధతిలో ఒకటి. 5-7 నిముషాలు చల్లని మంచి కొబ్బరి నూనెను నోటిలో వేసుకుని పుల్లింగ్ చెయ్యడం వల్ల ఇందులోని లారిక్ ఆమ్లం నోటిలోని బాక్టీరియా కొవ్వు పొరను విచ్చిన్నం చేసి వాటిని చంపుతుంది. అందుకనే ఆయిల్ పుల్లింగ్ ను నిపుణులు కూడా రికమెండ్ చేస్తారు. రోగనిరోధక శక్తిని పెంచడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ పద్ధతిని ఎవరికివారు చేసుకోవాలని చెబుతుంది. ఈ ఆయిల్ పుల్లింగ్ మీరు ఉదయం నిద్ర లేవగానే వెంటనే ఖాళీ కడుపుతో చెయ్యాలి.
హైడ్రేట్:
శరీరాన్ని కాపాడేందుకు రెండు గ్లాసుల నీరు త్రాగాలి. రెండవ గ్లాసు నీటిలో సగం నిమ్మకాయ మరియు కొంచెం అల్లం, ఒక చిటికెడు మిరియాలు పొడి, పసుపు, దాల్చిన చెక్కలను వేసుకుని తాగితే ఇది మీకు సొంత ఇమ్యూనిటీ డ్రింక్ ల పని చేస్తుంది. ఇది తాగడం వల్ల ఆరోగ్యకరమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉంటారు.
వ్యాయామం:
శరీరానికి అలసట రాకుండా ఉండటం కోసం రోజు ఉదయం వ్యాయామం తప్పకుండా చేయాలి. ఏదైనా వ్యాయామం రోజు ఒక 40 నిమిషాలపాటు చేస్తే అది మిమ్మలిని రోజంతా యాక్టీవ్ గా ఉండేలా చేస్తుంది. అలాగే అది మిలో బలాన్ని, దృఢత్వాన్ని మరియు ఫ్లెక్సిబిలిటీ ని పెంచుతుంది. మొదటి సారి మీరు వ్యాయామం మొదలు పెట్టె తప్పుడు సులువైన జాగింగ్ లేదా సైకిల్ తొక్కడంతో ప్రారంభించండి. ఆ తరువాత మీరు ఇంకా ఎక్కువ చెయ్యాలనుకుంటే మీ శరీరాన్ని, మీ ఆరోగ్యాన్ని బట్టి వేరే వ్యాయామం చెయ్యండి. ఆరోగ్యకరమైన మరియు బలమైన శరీరం రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
హెల్దీ బ్రేక్ ఫాస్ట్ :
బ్రేక్ ఫాస్ట్ రోజు మొత్తంలో తినే ఆహారంలో ముఖ్యమైనది. మీరు బ్రేక్ ఫాస్ట్ గా ఆరోగ్యకరమైన మరియు పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మంచిది. బ్రేక్ ఫాస్ట్ లో డెయిరీ ప్రొడక్ట్స్, గుడ్లు వంటి ప్రోటీన్లు ఉండే వాటితో పాటు పోషకాలున్న ఆహారాన్ని తీసుకోండి. తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు పిండి పదార్థాలు మరియు ఫైబర్ ఉన్న వాటిని బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవాలి.
రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి రోజు రెండు స్పూన్ల మంచి కొబ్బరి నూనెను తీసుకునే అలవాటు చేసుకోండి. ఇది శాకాహారంలో చాలా మంచి ఫుడ్. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా ఉపయోగపడుతుంది. దీనిని డైరెక్ట్ గా తీసుకోలేకపోతే మీ బ్రేక్ ఫాస్ట్ లో కలుపుకుని తినొచ్చు.
దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి.
No comments