Header Ads

ముఖం మీద మచ్చలు ఉన్నాయా.. ఇలా చేయండి..

కొన్నిసార్లు ఎన్ని క్రీమ్స్ రాసినా ముఖం మీద ఉండే మచ్చలు పోవు అలాంటప్పుడు ఎలాంటి టిప్స్ వాడాలో తెలుసుకోండి..

ముఖం మీద మచ్చలు ఉన్నాయా.. ఇలా చేయండి..

Is there a permanent solution for pigmentation on my face? (Beauty query of  the day) | TheHealthSite.com 

 
వయసు మీద పడుతున్న కొద్దీ స్కిన్ మీద డార్క్ స్పాట్స్ రావడం సహజమే. వీటిని ఏజ్ స్పాట్స్ లేదా లివర్ స్పాట్స్ అంటారు. ఇవి మీ ముఖం, మెడ, కాళ్ళు, చేతులు, భుజాలు, ఎక్కడైనా రావచ్చు నిజానికి. కొంత మందికి వయసు తో సంబంధం లేకుండా కూడా ఈ హైపర్ పిగ్మెంటేషన్ రావచ్చు. ఈ సమస్య పరిష్కారానికి చక్కని ఇంటి చిట్కాలు ఉన్నాయి. వీటిని ట్రై చేయండి మరి.

POTATO LEMON FACE MASK FOR GLOWING SKIN

1. బంగాళా దుంప, నిమ్మరసం..

Adv: అమెజాన్‌లో కిచెన్ & డైనింగ్ ఐటమ్స్‌పై క్లియరెన్స్ సేల్ | 70% వరకు తగ్గింపు
ఒక బంగాళా దుంపని తురిమి అందులో పావు కప్పు నిమ్మరసం కలపండి. ఈ మాస్క్ ని పిగ్మెంటెడ్ ఏరియాస్ మీద అప్లై చేసి అరగంట ఆగి చల్లని నీటితో కడిగేయండి. ఇలా నెల రోజుల పాటూ రోజుకి రెండు సార్లు చేయవచ్చు.

How to Make an Anti-Aging Honey and Lemon Face Mask - Bellatory - Fashion  and Beauty

2. నిమ్మరసం, తేనె..

రెండు టేబుల్ స్పూన్ల తేనె లో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మ రసం వేసి కలపండి. అవసరమున్న చోట ఈ మిశ్రమాన్ని అప్లై చేయండి. గోరు వెచ్చని నీటిలో మెత్తటి బట్ట ముంచి పిండేసి ఆ బట్టని ఈ మిశ్రమం అప్లై చేసిన చోట కవర్ చేసినట్లుగా వేయండి. ఇరవై నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఇలా వారానికి ఒక సారి మీకు ఫలితం కనిపించే వరకూ చేయవచ్చు.

Fruit Cider Photos, 1,000+ High Quality Free Stock Photos


3. యాపిల్ సిడర్ వెనిగర్

అర కప్పు యాపిల్ సిడార్ వెనిగర్ లో అర కప్పు నీరు కలపండి. పిగ్మెంటేషన్ ఉన్న చోట ఈ నీటిని పోయండి. నాలుగైదు నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఇలా రోజుకి రెండు సార్లు నెల రోజుల పాటూ చేయండి.

Amazing Benefits of Milk and Turmeric | Best Health Tips in Telugu | VTube  Telugu - YouTube

4. పసుపు, పాలు

ఒక బౌల్ లో ఐదారు టీ స్పూన్ల పసుపు తీసుకుని అందులో తగినంత పాలు పోసి స్మూత్ పేస్ట్ లా చేయండి. ఎఫెక్ట్ అయిన ఏరియా మీద ఈ పేస్ట్ అప్లై చేసి ఐదు నిమిషాలు గుండ్రంగా మసాజ్ చేయండి. ఆ తరువాత ఇరవై నిమిషాల పాటూ వదిలేయండి. గోరు వెచ్చని నీటితో కడిగేయండి. రోజూ స్నానానికి ముందు ఒక సారి ఇలా చేయవచ్చు.

ప్రతిరోజూ పొద్దున్నే ఆలోవెరా మరియు తేనె కలిపి తీసుకోడం వలన 9 ఆరోగ్య లాభాలు  | 9 Health Benefits Of Aloe Vera & Honey When Consumed Every Morning -  Telugu BoldSky


5. అలో వెరా, తేనె

ఫ్రెష్ అలో వెరా పల్ప్ రెండు టేబుల్ స్పూన్లు, తేనె ఒక టేబుల్ స్పూన్ తీసుకుని రెండింటినీ బాగా కలపండి. పిగ్మెంటేషన్ ఉన్న చోట అప్లై చేసి ఇరవై నిమిషాలు వదిలేయండి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఇలా రోజుకి ఒక సారి రెండు మూడు వారాలు చేయవచ్చు. ఆ తరువాత రోజు విడిచి రోజు చేయవచ్చు.

కమలా పండు తొక్కలు వల్ల కలిగే ప్రయోజనాలు||Benefits of Orange fruit  peel||kamala fruit peel benefits|| - YouTube

6. కమలాపండు తొక్కల పొడి

ఒక టేబుల్ స్పూన్ ఎండిన కమలా పండు తొక్కల పొడి, ఒక టీ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ ముల్తానీ మిట్టీ, ఒక టీ స్పూన్ నిమ్మ రసం, తగినంత నీరు కలిపి స్మూత్ పేస్ట్ లా చేయండి. డార్క్ స్పాట్స్ ఉన్న చోట ఈ మిశ్రమాన్ని అప్లై చేసి ఆరనివ్వండి. ఆరిన తరువాత కొద్ది గా నీరు చల్లి మీ వేళ్ళతో గుండ్రంగా మసాజ్ చేయండి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. వారానికి మూడు నాలుగు సార్లు ఇలా చేయవచ్చు.

Report: Avocado Crime Is on the Rise


7. అవకాడో

ఒక అవకాడో నుండి తీసిన గుజ్జులో ఒక టీ స్పూన్ పాలు, రెండు టీ స్పూన్ల తేనె వేసి కలపండి. అవసరమైన చోట అప్లై చేసి ఆరనివ్వండి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఇలా రోజుకి ఒకసారి చేయవచ్చు.


శ్రీ గంధం ప్రాధాన్యత ప్రయోజనం: ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా? | Importance of  Sri Gandham - Telugu Oneindia

8. గంధం

రెండు మూడు టేబుల్ స్పూన్ల గంధం పొడి లో ఒక టీ స్పూన్ పసుపు, తగినన్ని పాలు పోసి స్మూత్ పేస్ట్ లా చేయండి. డార్క్ స్పాట్స్ ఉన్న చోట అప్లై చేసి ఇరవై నిమిషాల పాటూ ఆరనివ్వండి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఇలా రోజూ చేయవచ్చు. ఇందు వల్ల పిగ్మెంటేషన్ పోవడమే కాదు, మళ్ళీ రాకుండా ఉంటుంది కూడా.


Almond/Badam - 1 kg - Chennai Brothers
9. బాదం

ఏడెనిమిది గంటలు నాన బెట్టిన ఐదారు బాదం పప్పుల్ని అవసరమైనన్ని పాలు పోసి మెత్తని పేస్ట్ లా చేయండి. ఇందులో ఒక టీ స్పూన్ తేనె, ఒక టీ స్పూన్ నిమ్మ రసం వేసి కలపండి. రాత్రి పడుకునే ముందు పిగ్మెంటేషన్ ఉన్న చోట ఈ మిశ్రమం అప్లై చేయండి. మర్నాడు పొద్దున్న చల్లని నీటితో కడిగేయండి. ఇలా రెండు మూడు వారాలు చేయవచ్చు. ఆ తరువాత వారానికి రెండు సార్లు చేయవచ్చు.


benefits of eating raw onions: కాన్సర్‌కి చెక్ పెట్టాలంటే ఇది తినాల్సిందే..  - impressive and effective health benefits of oinions | Samayam Telugu


10. ఉల్లిపాయ, యాపిల్ సిడార్ వెనిగర్


ఒక ఉల్లిపాయని పేస్ట్ చేసి, ఆ పేస్ట్ ని ఒక కాటన్ బట్టలో వేసి పిండితే జ్యూస్ వస్తుంది. ఈ జ్యూస్ లో యాపిల్ సిడార్ వెనిగర్ వేసి డార్క్ స్పాట్స్ మీద అప్లై చేయండి. ఇరవై నిమిషాల పాటూ ఆరనివ్వండి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఇలా రోజూ రెండు వారాల పాటూ చేయవచ్చు.


హైపర్ పిగ్మెంటేషన్ ఏర్పడకుండా ఉండటానికి ఈ టిప్స్ పాటించండి.

1. బయటకు వెళ్ళినప్పుడు కనీసం ఎస్పీఎఫ్ 30 ఉన్న సన్ స్క్రీన్ వాడండి. అవసరాన్ని బట్టి మూడు గంటల కొకసారి మళ్ళీ అప్లై చేయండి.
2. స్కిన్ కేర్ రొటీన్ తప్పని సరిగా ఫాలో అవ్వాలి. రాత్రి పడుకునే ముంది మేకప్ రిమూవ్ చేసేసి నైట్ క్రీమ్ అప్లై చేసుకుని పడుకోండి.
3. రెగ్యులర్ గా ఎక్స్ఫోలియేట్ చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ పోతాయి.
4. రోజూ తగినంత నీరు తాగండి,
5. ఆయిలీ ఫుడ్ ని వీలున్నంత తగ్గించండి.
6. పాల కూర వంటి ఆకుకూరల్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. అవి మీ డైట్ లో భాగం చేసుకోండి.
7. రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. స్కిన్ కి కావాల్సిన పోషణ అందడం వల్ల పిగ్మెంటేషన్ కంట్రోల్ అవుతుంది.

ఈ హైపర్ పిగ్మెంటేషన్ ఎలాంటి హానీ చేయడు. కానీ ఈ క్రింది లక్షణాలు మీరు గమనిస్తే తక్షణం డాక్టర్ ని కన్సల్ట్ చేయండి.

1. కొన్ని డార్క్ స్పాట్స్ మిగిలిన వాటి కంటే ఎక్కువ డార్క్ గా ఉంటే,
2. డార్క్ స్పాట్స్ చుట్టూతా డార్క్ సర్కిల్ ఏర్పడుతూ ఉంటే,
3. అవి సైజ్ పెరుగుతూ ఉంటే
4. రెడ్ కలర్ లోకి మారుతూ ఉంటే,


వెంటనే డాక్టర్ ని కలవండి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.


దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి.

No comments

Post Top Ad

Post Bottom Ad