Header Ads

రక్తంలో మలినాలు తొలగించే బీట్ రూట్..

బీట్ రూట్ అత్యంత ఆరోగ్యకరమైన ఆహార పదార్ధాలలో ఒకటి. రక్తంలోని అధిక వేడిని తగ్గించి, రక్తానికి చలువ చేయడం కోసం ఈ బీట్ రూట్‌ను పూర్వం తినేవారట. దీనిలో విటమిన్ బి, సి, ఫాస్పరస్, ప్రొటీన్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం వంటి మూల పదార్థాలున్నాయి.

రక్తంలో మలినాలు తొలగించే బీట్ రూట్.. | Health Tips | Health Tips In Telugu  - Healthchitkalu.com

బీట్‌రూట్ ఆలస్యంగా జీర్ణమై విరోచనాలను అరికడుతుంది. రక్తంలోని మలినాలను తొలగించి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్తవృద్థి చేస్తుంది. వండి తినడం కన్నా పచ్చిదే రసం తీసి త్రాగితే ఎంతో మంచిది. బీట్‌రూట్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాబేజీ లేదా బొప్పాయి కలిపి జ్యూసు చేసుకుని దానికి తేనె కలిపి తాగితే చాలా మంచిది.

బీట్ రూట్ వల్ల శారీరక నీరసం, రక్తహీనత హరిస్తాయి. శరీరం పునరుజ్జీవనమవుతుంది. బీట్‌రూట్ రసంలో తేనె కలిపి తీసుకుంటే సహజంగా వ్యాధి నిరోధక శక్తి పెరిగి, వ్యాధి కారక వ్యర్థ పదార్థాలు విసర్జింపబడి క్రమంగా వ్యాధి కనుమరుగై పోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

health benefits of beetroot

బీట్‌రూట్ రసం అనారోగ్య సమస్యలను సునాయాసంగా నయం చేస్తుందట. బీట్ రూట్ రసంలో కొద్దిగా చక్కెర కలిపి తీసుకుంటే సన్నగా ఉన్నవారు బలిష్టంగా ఎర్రగా తయారవుతారు. శరీరంలోని నలుపు రంగు ఎరుపుగా మారుతుంది.

No comments

Post Top Ad

Post Bottom Ad