రైస్ కుక్కర్ లో వండిన అన్నం తింటున్నారా ?
మారుతున్న రోజుల్లో ప్రతీ మనిషి టెక్నాలజీ ఉపయోగించుకుంటున్నారు. ఉదయం లేచినప్పటి నుండి పడుకొనే వరుకు అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలే ఉపయోగిస్తున్నారు. వంట అంత కూడా ఎలక్ట్రానిక్ వస్తువుల్లోనే చేస్తున్నారు. చిన్న చిన్న మార్పులు ఇప్పుడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. రైస్ కుక్కర్ లో అన్నం వండితే విషంగా మారుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
ఇలా వండిన అన్నం విషంగా మారడానికి కారణం రైస్ కుక్కర్లు. కుక్కర్లో ఉండే గిన్నెలు అల్యూమినియంతో తయారుచేస్తారు. అల్యూమినియం పాత్రల్లో వంట చేయటం, తయారుచేసిన ఆహారాన్ని నిల్వ చేయటం మంచిది కాదని నిపుణులు చెప్తున్నారు. ఆహారం వండేటప్పుడు గాలి వెలుతురు తగులుతూ ఉండాలి. అలా లేకపోతే ఆహారం విషంగా మారుతుంది.
ఇలా విషంగా మారితే ఫుడ్ పాయిజిన్ అవుతుంది. ఈ విషం శరీరంలోకి చేరి కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలకు ఆ విష ప్రభావం బయట పడుతుంది. ప్రెజర్ కుక్కర్ లేదా కరెంట్ రైస్ కుక్కర్ లో అన్నం వండేటప్పుడు గాలి వెళ్ళే అవకాశం ఎట్టి పరిస్థితిలోను ఉండదు. దీంతో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. అల్యూమినియం పాత్ర తో ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసుకుందాం.
ఉదర సంబంద సమస్యలు, గుండె సంబందిత సమస్యలు, కీళ్ల వాతం, మధుమేహం, గ్యాస్ సమస్యలు, అధిక బరువు, నడుము నొప్పి వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ప్రేజర్ కుక్కర్ లేదా కరెంట్ కుక్కర్ లో వండటం సాధ్యమైనంత వరకు మానేయటమే ఉత్తమం.
No comments