Header Ads

బీన్స్ ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా !

గ్రీన్ వెజిటేబుల్స్ మన ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికి తెలిసిన విషయమే. అందులో ముఖ్యంగా బీన్స్ కూడా ఉన్నాయి. భయంకరమైన ఆరోగ్య సమస్యలకి, వాటికి కారణమయ్యే కొలెస్ట్రాల్‌ని ఎదుర్కొనే శక్తి బీన్సులో పుష్కలంగా ఉందని, బీన్సులో ఉండే పోషకాలు ఆరోగ్యాన్ని రక్షిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువే. గ్రీన్ బీన్స్ లో ఉండే అన్ని అమినో ఆసిడ్స్ మన డైట్ కు చాలా అవసరం అవుతాయి. అంతే కాదు మాంసాహారం, గుడ్లు, చేపలు, డైరీ ప్రోడక్ట్స్ లో ఉండే అమినో యాసిడ్స్ కంటే ఇందులో ఎక్కువగా ఉన్నాయి.

బీన్స్ ను ఇలా తినడం వలన కలిగే ఆరోగ్య రహస్యాలు | Amazing benefits of beans |  - YouTube


ఒక కప్పు బీన్సును ఉడికించి తీసుకుంటే ఆరువారాల పాటు పదిశాతం కొలెస్ట్రాల్‌ను బీన్సు తగ్గిస్తుందని పరిశోధనలో తేలాయట. వారంలో నాలుగురోజుల పాటు మన ఆహారంలో బీన్సును చేర్చి తినడం వల్ల గుండె నొప్పిని తగ్గించవచ్చట. డెబ్బై శాతం వరకు గుండె జబ్బులను తగ్గించుకోవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. గ్రీన్ బీన్స్ లో విటమిన్లు, ప్రోటీనలు, మినిరల్స్, మైక్రోన్యూట్రియంట్స్ పుష్కలంగా ఉన్నాయి. అంతే కాదు డైటరీ ఫైబర్ కూడా అధికంగా ఉంది. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే వెజిటేరియన్స్ లవర్స్ వారి రెగ్యులర్ డైట్ లో బీన్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.

బీన్స్ లో పిగ్మెంట్ యాంటీయాక్సిడెంట్స్, ఫ్లెవనాయిడ్ పుష్కలంగా ఉండటం వల్ల గౌట్ క్యాన్సర్ మరియు బ్రెస్ట్ క్యాన్సర్ సెల్స్ యొక్క ఉత్పత్తిని తగ్గించి, క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఐరన్, విటమిన్లు, మినరల్స్ ఉన్న బీన్సును తినడం వల్ల ఐరన్ లోపం నివారణ జరిగి అనీమియా రాకుండా అడ్డుకొంటుంది. అంతేకాకుండా మలబద్దకంతో బాధపడే వారికి బీన్సు మంచి మందుగా పనిచేస్తుందట. బీన్స్ లో ఉండే ఫొల్లెట్ గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది మరియు కడుపులో పెరిగే బిడ్డకు కూడా ఆరోగ్యంకమైన ఆహారం మరియు మంచిది.

No comments

Post Top Ad

Post Bottom Ad