Header Ads

సొరకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..

సొరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సొరకాయ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. మన శరీరంలోని అధిక వేడిని బయటకు పంపి మనకు మేలు చేస్తుంది. ఇందులో సోడియం చాలా తక్కువగా ఉండటం వల్ల అధిక రక్తపోటు, హృదయ సంబంధ సమస్యలతో బాధపడేవాళ్లకు ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. పిండి పదార్థాలు ఇందులో వుండటం ద్వారా మధుమేహాన్ని దూరం చేస్తాయి. మూత్రనాల జబ్బులకు సొరకాయ చాలా మంచిది

Health Benefits of Bottle Gourd ll Best Health Tips In Telugu - YouTube

సొరకాయలో చాలా తక్కువ కాలరీలు ఉంటాయి. కాబట్టి అధిక బరువుతో బాధపడేవాళ్లు ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది. దీంట్లో ఉండే 90 శాతం నీరు అధిక దాహాన్ని, వేడిని తగ్గిస్తుంది. కాబట్టి వేసవిలో ఈ జ్యూస్‌ను తాగొచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. సొరకాయను తీసుకోవడం ద్వారా రక్తప్రసరణ సవ్యంగా జరిగేలా చేస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి సాయపడుతుంది. మలబద్థక, కాలేయ సమస్యను ఉన్నవారికి సొరకాయ చాలా మంచిది.

సొరకాయ మెదడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మెదడులోని కణాలు ఉత్తేజితమవుతాయి. ఈ రోజుల్లో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుండటం, చాలామందికి నిద్రపట్టకుండా కళ్ళు మంటలు వస్తాయి. నువ్వుల నూనెతో సొరకాయ వేపుడు చేసుకుని తింటే నిద్ర సమస్యను అధిగమించవచ్చు. అసిడిటీని దూరం చేస్తుంది. సొరకాయలో ఎక్కువగా ఉండే విటమిన్‌-సి చర్మానికి నిగారింపును ఇస్తుంది. సొరకాయ సులభంగా జీర్ణమవుతుంది.

No comments

Post Top Ad

Post Bottom Ad