లో బీపీ ఉన్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు..
లో బీపీ.. ఈ సమస్య చాలా మందిలో ఉంటుంది. శరీరంలోని అవయవాలకు రక్త సరఫరా ఒక్కోసారి రక్తం సరఫరా అవదు. ఫలితంగా లోబీపీ వస్తుంది. అయితే లోబీపీ వచ్చేందుకు అనేక కారణాలుంటాయి. ఆహారంలో పోషకాలు ఉండకపోవడం, సుదీర్ఘ కాలం పాటు బెడ్ రెస్ట్ తీసుకోవడం, గర్భంతో ఉన్న సమయంలో, పలు మెడిసిన్లను వాడడం, ఇన్‌ఫెక్షన్ల బారిన పడడం, రక్తం తగినంత లేకపోవడం, గుండె జబ్బులు ఉండడం.. వంటి అనేక కారణాల వల్ల చాలా మందిలో లోబీపీ వస్తుంటుంది. పలు సూచనలు పాటిస్తే లోబీపీ నుంచి బయట పడవచ్చు. మరి ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
వారం రోజులపాటు ఉదయం ఒక కప్పు, సాయంత్రం ఒక కప్పు పచ్చి బీట్‌రూట్ రసం తాగితే రక్త ప్రసరణను క్రమబద్ధీకరించవచ్చు. దానిమ్మ రసం కూడా రక్త ప్రసరణ వేగాన్ని తగ్గిస్తుంది. అలాగే వారం రోజులపాటు తాజా పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకుంటే బీపీ క్రమబద్ధం కావటంతోపాటు శారీరక వ్యవస్థ మొత్తం శక్తివంతం అవుతుంది. అయితే రోజుకు మూడుసార్లూ తాజా పండ్లనే తీసుకోవాలి. ఐదు గంటల వ్యవధిలో పూర్తిస్థాయి భోజనానికి సరిపడే మోతాదులో పండ్లను తినాలి. లోబీపీ ఉన్నవారు కూర్చున్నప్పుడు కాళ్లను నిటారుగా కాకుండా క్రాస్ చేసి కూర్చోవాలి. దీని వల్ల బీపీ పెరుగుతుంది. లోబీపీ నుంచి తప్పించుకోవచ్చు.
లోబీపీ ఉన్నవారు ఉప్పు ఎక్కువగా తినాలి. అలా అని చెప్పి నిత్యం మోతాదుకు మించి తినరాదు. కాకపోతే ఉప్పు వాడకం పెంచాలి. దీంతో బ్లడ్ ప్రెషర్ సాధారణ స్థాయికి చేరుకుంటుంది. లోబీపీ తగ్గుతుంది. లోబీపీ ఉన్నవారు రోజుకు 3 సార్లు కాకుండా కొద్ది కొద్దిగా 5 లేదా 6 సార్లు భోజనం చేయాలి. లోబీపీ ఉన్నవారు నీటిని బాగా తాగాలి. దీంతో రక్తం పరిమాణం పెరుగుతుంది. లోబీపీ రాకుండా ఉంటుంది. రోజ్ మేరీ నూనెలో కర్పూరం ఉంటుంది. ఇది శ్వాస వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. దీని వల్ల రక్త సరఫరా సజావుగా సాగుతుంది. అందుకే రోజ్ మేరీ నూనె బీపీని తగ్గించడంలో సహకరిస్తుంది.
No comments