అందమైన కళ్ళు మీ అందాన్ని నిబడీకృతం చేస్తాయి. చక్కటి కలువల్లాంటి కళ్ళు కోసం ఈ చిట్కాలు పాటించండి. » అరటిస్పూన్ కిరా రసంతో కొద్దిగా రొజ్ వాటర్ కలిపి ఈ మిశ్రమాన్ని కళ్ళకు రాసుకుని అరగంట సేపు ఉంచి ఆ తర్వాత కడుక్కుంటే కళ్ళు ఆకర్షణీయంగా ఉంటాయి. » కళ్ళు చాలా సున్నితమైనవి కాబట్టి బజారున దొరికే ఏ క్రీమ్ పడితే ఆ క్రీం రాసేయకూడదు.అలా చెయడం వల్ల మీ కళ్ళు ఇన్ పెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంది. » తగినంతసేపు నిద్ర పోవడం వల్ల కళ్ళు తాజాగా కనబడతాయి. » గ్లాస్ నిటిలో ఉసిరి పొడి నానబెట్టి ఉదయాన్నే ఈ మిశ్రమంతో కళ్ళు కడుక్కుంటే తాజాగా మెరుస్తాయి. » కళ్ళ చుట్టూ ఉండే ముడతలు పొవాలంటే పాలమిగడతో అక్కడ మసాజ్ చేసుకుంటే ముడతలు నుండి విముక్తి పొందవచ్చు. » కీరదోసకాయలను చక్రాల్లా కోసి ఆ చక్రాలను కళ్ళ మీద ఉంచుకుంటే కళ్ళూ తాజాగా ఉంటాయి. » రోజూ పావుగంట పాటు రెండు చేతులను రేండు కాళ్ళపై ఉంచుకుని ప్రశాంతంగా కూర్చుంటే మీ కళ్ళకు రిలిఫ్ లభిస్తుంది. » అల్మాండ్ ఆయిల్ లొ కొంచెం ఆలివ్ అయిల్ కలిపి కంటి చుట్టూ ఉండే నలుపు ప్రాంతంపై రాస్తే ఆ నలుపును నివారించవచ్చు. » కళ్ళకు మేకప్ వేసుకునే బ్రష్ల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.వీటిపై ఉండే దుమ్ము,ధూళీ వల్ల మీ కళ్ళకు ఇంఫెక్షన్ రావచ్చు. » ఉప్పు నీటితొ కళ్ళను కడుక్కోవడం వల్ల కళ్ళు మెరుస్తాయి.