పెద్దలు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన అంశాలు:
ఉదయాన్నే మూడు లేదా నాలుగు నానబెట్టిన బాదం పప్పును తినటం చాలా మంచిది.
ఉదయాన్నే కనీసం ఒక అరగంట యోగ, ధ్యానం, నడక ఏదో ఒకటి కచ్చితంగా అలవాటుగా చేసుకోండి.
ప్రతి మనిషికి కనీసం 7 గంటల గాఢ నిద్ర అవసరం.
ఉప్పు వినియోగం గణనీయంగా తగ్గాలి. వాడకానికి సముద్రపు ఉప్పు చాలా మంచిది.
టీ, కాఫీలకు వీలైనంత వరకు దూరంగా ఉండండి. రాగిజావ ఆరోగ్యానికి చాలా మంచిది.
ఫంక్షన్స్ కి , వేరే ప్రదేశాలకి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా తినవలసి వస్తే వాటిలో మనకు సౌలభ్యంగా ఉండేవాటినిఎంచుకొని మరీ తినాలి. సాధ్యమైనంత వరకు బయట తినటానికి నిరాకరించడమే మంచిది.
కూరగాయలను, పండ్లను మార్కెట్ నుండి తెచ్చిన తరువాత గోరు వెచ్చని నీటిలో ఉప్పు వేసి 15 నిమిషాలపాటుఉంచండి. ఆ తరువాత ఆ నీటిని పారపోసి మరలా వాటిని కడిగి పెట్టుకోండి. మరొక సారి కడగటం వల్ల చాలా వరకు హానికరమైన రసాయనాలను తొలగించవచ్చు.
నీరు త్రాగటం చాలా మంచి అలవాటు. కనీసం రోజుకు 5 లీటర్లు నీరు అయినా త్రాగాలి. వీలైతే చల్లని నీరు కన్నాగోరు వెచ్చని నీరు ఆరోగ్యానికి అత్యంత మంచిది. ఉదయాన్నే ఒక లీటరు, గంట తరువాత ఒక లీటరు ఖచ్చితంగా త్రాగండి.
రాత్రి 7.00 గంటల లోపు లేదా ఖచ్చితంగా 8.00 గంటల లోపు ఆహారం తీసుకోండి. తిన్న తరువాత కనీసం ఒక అరగంట అయిన కచ్చితంగా నడవండి.
దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి.
No comments