ఆహారం.......... ఆరోగ్య చిట్కాలు:
అల్పాహారం ఆరోగ్య చిట్కాలు:
ఉదయాన్నే బియ్యంతో చేసిన ఇడ్లీ, దోశలకు దూరంగా ఉండాలి. వాటి బదులు జొన్నలు, మినుములుతో చేసిన ఇడ్లీ, దోశలను తినండి. ఇడ్లీ, దోశ వారానికి ఒకసారి మాత్రమే తినండి.
దోశలను నెయ్యితో కాల్చుకోండి నూనెను పూర్తిగా దూరం చేయండి.
ఉడకబెట్టిన శనగలు, వేరుశనగలు, అలచందలు చాలా మంచి ఆహారం.
మొలకెత్తిన గింజలు అత్యంత ఆరోగ్యకరం.
పూరీలు, మైసూర్ బోండా మొదలైన టువంటిది నెలకు ఒక్కసారి అయితే పరవలేడు. వీలైతే వాటి సంచి పర్తిగా దూరంగా ఉండండి.
వారానికి ఒకటి లేదా రెండు సార్ల వరకు చపాతీని నెయ్యితో కాల్చుకొని తినటం కూడా చెక్కవచ్చు.
మధ్యాహ్న భోజనం ఆరోగ్య చిట్కాలు:
పాలిష్ బియ్యానికి పూర్తిగా దూరమవ్వాలని. వేరే మార్గం లేదు. దీని విషయంలో మరొక ఆలోచన కూడా అనవసరం.
బియ్యానికి దూరం కాయలేకపోతే మిగిలిన ఏకైక మార్గం ముడి బియ్యం అని గుర్తుంచుకోవాలి. తృణధాన్యాలు మంచి బలవర్ధక ఆహారం.
రాగి సంగటి, జొన్న అన్నం, కొర్ర అన్నం మొదలైనవి అన్యంత ఆరోగ్యకరమైన ఆహారం. కొర్రలు ప్రపంచస్థాయిని ఆకర్షించే అత్యంత పౌష్టికాషరం.
మధ్యాహ్న భోజనంగా అన్ని రకాల కూరగాయలను తీసుకోండి. అన్నింటినీ నూనెలు లేకుండా చక్కగా వండుకొని తినవచ్చు.
ఖచ్చితంగా వారానికి మూడు రోజులపాటు ఆకు కూరలు వండవలసినదే. దీనిని ఖచ్చితంగా పాటించండి
రాత్రి భోజనం ఆరోగ్య చిట్కాలు:
ఖచ్చితంగా 7.00 లేదా 8.00 గంటల మధ్యలో రాత్రి భోజనం పూర్ణయ్యలాగా చూసుకోండి.
రాత్రికి రెండు లేదా మూడు జొన్న రొట్టెలు తీసుకొనటం అత్యంత ఆరోగ్యకరం.
వేపాకులను మజ్జిగలో మెత్తగా రుబ్చీ ఆ పేస్టును కాలిన గాయాల పై రాస్తే ఉపశమనంగా ఉంటుంది.
శరీరం పై కాలిన చోట పాలమీగడ రాస్తే బాధ తగ్గటమే కాదు, శరీరం రంగు కూడా మారుతుంది.
ఒక కప్పు నీళ్ళల్లో గుప్పెడు తులసి ఆకులు, చెంచా మిరియాల పొడి వేసి బాగా మరగించి అందులో రవ్వంత తేనె లేదా పంచదార కలిపి వేడిగా త్రాగితే జలుబు, దగ్గు తగ్గుతాయి.
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కొవ్వు పదార్థాలు తక్కువ వుండే ఆహారపదార్థాలు తీసుకోవాలి.
మధుమేహంతో బాధపడేవారు నిత్యం ఆహారంలో వెల్లుల్లి ఉండేలా చూసుకుంటే ఎంతో మేలు.
ఎండలో ఎక్కువ సేపు తిరగడం వల్ల తలనొప్పి వచ్చినా తల తిరిగినట్లుగా ఉన్నా చిన్న అల్లం ముక్క నూరి నిమ్మరసంలో కలిపి త్రాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది.
ముక్కు దిబ్బెడ వేసినప్పుడు ఒక చుక్క ఉల్లిరసాన్ని నాసికా రంధ్రాల్లో వేస్తే ఉపశమనం కలుగుతుంది.
మతిమరపు ఉన్నవారు తేనెను వాడాలి. జ్ఞాపకశక్తి పెంపొందుతుంది.
సగానికి కోసిన నిమ్మచెక్క పై ఉప్పు, మిరియాల పొడి చల్లి సౌ మీద కొద్దిగా వేడి చేసి రసం పిండుకొని త్రాగితే మైగ్రెయిన్ తలనొప్పి నుంచి, వడదెబ్బ నుంచి ఉపశమనం లభిస్తుంది.
నిమ్మరసం, తేనె, గ్లిసరిన్ సమపాళ్ళలో కలిపి తడవకు చెంచా చొప్పున రోజుకు మూడుసార్లు తీసుకుంటే దగ్గు తగ్గుతుంది.
దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి.
No comments