Header Ads

పిల్లలు పుట్టని వారు వారం రోజులు ఇవి వాడండి… ఖచ్చితంగా పుట్టే అవకాశం ఉందట!!

కారణాలు ఏవయినా ఇప్పుడు కొత్తగా పెళ్లయిన జంటల్లో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య సంతాన లేమి. దానికి అనేక అత్యాధునిక వైద్య పద్ధతులు అందుబాటులోకి వచ్చినట్లే.. కొత్త కొత్త సమస్యలు కూడా పుట్టుకొస్తున్నాయి. అటువంటి వారికి సంతాన సాఫల్యత అందించడం కోసం ప్రపంచ వ్యాప్తంగా లోతయిన పరిశోధనలే జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆడవాళ్లు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారాలు చూపడం ద్వారా సంతాన భాగ్యం కలిగించేందుకు విశేష కృషి చేస్తున్నారు.


పిల్లలు పుట్టని వాళ్లు వారం రోజులు ఇవి వాడండి...ఖచ్చితంగా పుడతారు.. -  Telugudesk


ఆ కోవలోనే ఇప్పుడు తెలుసుకోబోయే పరిష్కారం ఒకటి. ఇంకా చెప్పాలంటే.. ఇది నిజంగా వైద్యం కాదు ఒక పరీక్ష మాత్రమే. ఆడవాళ్లలో సంతానలేమి సమస్యలకు ఫెల్లోపియన్ ట్యూబ్స్ కొంతవరకు కారణం అవుతాయి. వీటిని శుభ్రం చేయడం ద్వారా కొంతమందిలో సంతానలేమిని చాలా ఈజీగా దూరం చేయొచ్చు. వీటిని శుభ్రం చేయడానికి వీటిలోనికి నీటిని పంపి శుభ్రం చేస్తుంటారు.

అయితే.. ఆస్ట్రేలియా లోని అడిలైట్ విశ్వ విద్యాలయం, నెదర్లాండ్ విశ్వ విద్యాలయ అధ్యాపకులతో కూడిన బృందం సంతాన లేమితో బాధపడుతున్న 112 మంది మహిళల మీద విశ్లేషణాత్మక పరిశోధన చేసింది. వీరిలో సగం మందికి ఫెళ్లోపియన్ ట్యూబ్స్ లోకి గసగసాల నూనె పంపారు. మిగిలిన వారికి నీటిని పంపారు. కొన్నినెలల తరువాత వీరిని పరీక్షించగా గసగసాల నూనెతో శుభ్రం చేసిన వారిలో 40 శాతం మంది గర్బం దాల్చారు. అలాగే నీటితో శుభ్రం చేసిన వారిలో 18 శాతం మంది మాత్రమే గర్భం దాల్చారని తేలింది.

అయితే..గసగసాల నూనె ఉపయోగించడం వల్లనే వారు గర్భవతులు అయ్యారా? లేక మరేదైనా కారణమా? అనేదాన్ని మాత్రం వీరు స్పష్టం చేయలేక పోయారు. అయితే ఈ గసగసాల వైద్యం కొత్త ఏమి కాదనీ.. 1914 సంవత్సరంలోనే ఫెల్లోపియాన్ ట్యూబ్ లను శుభ్రం చేయడానికి ఈ నూనెను ఉపయోగించారని తెలిపారు. అంటే వందేళ్లుగా ఇది ఆచరణలో ఉన్న విధానమేనని చెప్పుకొచ్చారు. అయితే కాలక్రమేణా చాలా పద్ధతులు అమల్లోకి వచ్చాయి. అయినా సంతాన లేమికి బెస్ట్ రిజల్ట్ ఇచ్చిన గసగసాల నూనె తో కలిగే ప్రయోజనాలపై విస్తృతంగా పరిశోధనలు నిర్వహించాల్సి ఉందని ఆ అధ్యాపకులు అభిప్రాయడుతున్నారు.

ఫెల్లోపియన్ ట్యూబ్స్ కారణంగానే పిల్లలు లేని వారు ఒక వారం పాటు ఈ విధానాన్ని ఆచరిస్తే పిల్లలు పుట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయనే విషయం మాత్రం స్పష్టమవుతోంది. మాతృత్వ కోరికను నెరవేర్చుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు కదా.. 

ఈ ఒక్క చిన్న ప్రయత్నం చేస్తే కూడా రిజల్ట్ వస్తుందేమో?!!


దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి.

No comments

Post Top Ad

Post Bottom Ad