Header Ads

బీరకాయ తో ఇన్ని లాభాలా........

ప్రస్తుత ప్రపంచంలో యువతి యువకులు అందానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే వారికి అధిక బరువు సమస్య వేధిస్తోంది. నాజుగ్గా కనిపించడానికి ఎన్నో మందులు వాడుతున్నారు. కానీ వాటి వాడకం వల్ల శరీరానికి ఎన్ని ఇబ్బందులు తలెత్తుతాయనేది ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో సహజసిద్ధంగా బరువు తగ్గాలనే ఆలోచన చాలామందికి వచ్చింది.

Health Benefits Of Ridge Gourd - Sakshi

సాధారణంగా తెలుగు ప్రజలు బీరకాయను అప్పుడప్పుడు వినియోగిస్తుంటారు. కానీ బీరకాయ ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలిస్తే రోజు బీరకాయను వాడతారు. కేవలం బరువు తగ్గించడానికి మాత్రమే కాకుండా మరెన్నో ఆరోగ్య సమస్యలకు బీర సంజీవనిగా పనిచేస్తుంది. బరువు తగ్గడానికి ఈ కూరగాయ తింటే ఎన్ని లాభాల్లో తెలుసుకుందాం.

బరువు తగ్గాలనుకునేవారు
బరువు తగ్గాలనుకునే వారికి బీరకాయ మంచి ఔషధంగా పనిచేస్తుంది. సహజంగా బీరకాయలో ఫైబర్‌ ఎక్కువగా ఉండి, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కొవ్వును సైతం సులభంగా కరిగించే శక్తి బీరకాయ సొంతం.

 

మధుమేహులకు ఎంతో మేలు
నిత్యం బీరకాయను తినడం వల్ల శరీరంలో చక్కెర శాతాన్ని ఎక్కువ కాకుండా నివారిస్తుంది. మరోవైపు శరీరంలో ఇన్సూలిన్‌ ఉత్పత్తిని క్రమపద్ధతిలో ఉంచుతుంది. బీరలో శరీరానికి కావాల్సిన పెప్టైడ్స్‌, ఆల్క్‌లైడ్స్‌ ఎక్కువగా ఉండడం వల్ల శరీర రక్షణ వ్యవస్థను బలంగా ఉంచడంలో బీర కీలక పాత్ర పోషిస్తుంది. మధుమేహం ఉన్నవారు(డయాబెటిస్‌) నిత్యం బీరకాయను ఉపయోగించడం ఎంతో అవసరమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు

రోగనిరోధక వ్యవస్త పటిష్టం
మీరు నిత్యం లివర్‌, నేత్ర(కళ్ల), సమస్యలతో బాధపడుతున్నారా. అయితే మీకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని అర్థం. ఆరోగ్య సమస్యలతో నిత్యం బాధపడేవాళ్లు బీరకాయను విరివిగా తీసుకోవడం వల్ల రక్షణవ్యవస్థను బలంగా ఉంచే విటమిన్లు, ఖనిజాలు, ఐరన్‌, మాగ్నిషియమ్‌, థయమిన్‌ తదితర పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. రోగాలను ఎదుర్కోవాలంటే బీరకాయను వాడాల్సిందే.

రక్తహీనతకు మంచి మందు
ముఖ్యంగా మహిళలు సరియైన పోషకాహారం తీసుకోక రక్తహీనత సమస్యతో బాధపడుతుంటారు. ఐరన్‌ అందకపోవడమే రక్తహీనతకు ప్రధాన కారణం. ముఖ్యంగా ఎర్ర రక్తకణాల కౌంట్‌లో ఐరన్‌ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే నిత్యం బీరకాయను తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్యకు చెక్‌ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు

మెరిసే సౌందర్యం సొంతం చేసుకోవాలంటే
ఆహార లోపాల వల్లే చర్మ సమస్యలు వస్తుంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే మీరు బీరకాయను నిత్యం వాడుతుంటే నిగనిగలాడే మెరిసే సోందర్యాన్ని సొంతం చేసుకోవచ్చు.

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి .

No comments

Post Top Ad

Post Bottom Ad