Header Ads

ఈ ఆపిల్‌ పండ్లతో నిజంగా డాక్టర్‌ దూరం.......!

మెల్‌బోర్న్‌ : ‘రోజుకో ఆపిల్‌ పండు తింటే డాక్టర్‌ను దూరం పెట్టొచ్చు’ అన్నది పాత మాట. అయితే ఆపిల్‌ పండ్లలో ‘పింక్‌ లేడీ, బ్రేవో’ అనే రకం పండ్లు తింటే డాక్టర్‌ను కచ్చితంగా దూరం పెట్టవచ్చన్నది నేటి మాట. పశ్చిమ ఆస్ట్రేలియా భూముల్లో పండిస్తోన్న ఈ రెండు రకాల ఆపిల్‌ పండ్లు ప్రపంచంలోని అన్ని రకాల ఆపిల్‌ పండ్లకన్నా ఆరోగ్యకరమైనవని ఎడిత్‌ కోవన్‌ యూనివర్శిటీ పరిశోధకులు తాజాగా తేల్చారు. వీటిలో గుండె, క్యాన్సర్, మధుమేహ జబ్బులను తగ్గించే ‘పోలిఫెనాల్‌’ అనే సూక్ష్మ పోషకాలు ఉండడమే కారణమని వారు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న 91 రకాల ఆపిల్‌ పండ్లను సేకరించి వాటిపై ఈ పరిశోధకులు అధ్యయనం జరిపారు.

 Pink Lady Apple Keep Doctor Away - Sakshi

బ్రేవో రకం ఆపిల్‌ పండ్లలోకన్నా పింక్‌ లేడీ రకం పండ్లలో పోలిఫెనాల్‌ పోషకాలు ఎక్కువగా ఉన్నాయని ఈ అధ్యయనంలో పాల్గొన్న డాక్టర్‌ నికీ బాండొన్నో తెలిపారు. 30 మంది చొప్పున రెండు బృందాలను ఏర్పాటు చేసి ఓ బృందానికి పింక్‌ లేబీ, మరో బృందానికి బ్రేవో వెరైటీ ఆపిల్‌ పండ్లను తినిపించి అనంతరం వారి రక్తాల్లో పోలిఫెనాల్‌ పోషకాల స్థాయిని పరిశీలించామని డాక్టర్‌ చెప్పారు. అయితే ఈ పండ్ల రకాల్లో 50 శాతం పోలిఫెనాల్‌ పోషకాలు వాటి పొట్టులోనే ఉన్నాయని, ఆరోగ్యపరంగా లబ్ధి పొందాలంటే ఈ వెరైటీ పండ్లను పొట్టుతో సహా తినాలని డాక్టర్‌ సూచించారు. పింక్‌ లేడీ రకం ఆపిల్‌ పండ్లు భారత దేశంలో బిగ్‌ బజార్, అమెజాన్‌ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి.

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి . 

No comments

Post Top Ad

Post Bottom Ad