Header Ads

కూరగాయాలు, పండ్లు అన్నీ ఫ్రిడ్జిలో పెడుతున్నారా? అయితే ఇది మీకోసమే ఒకసారి చదవండి.

 Must Have Items for Every Runner's Fridge | Rock n Roll Marathon Series |  Marathon Half Marathon Events

క్యారెట్‌ తింటే కంటికి మంచిది.. ఆకుకూరలు తింటే శరీరానికి మేలు. ఇలా ఆరోగ్య నియమాలు పాటిస్తూ.. పోషకాహారంపై దృష్టి పెట్టడం మంచిదే. అంతకంటే ముఖ్యంగా వాటి పోషకాల పరిరక్షణపైన.. తాజాదనంపైనా దృష్టిపెట్టాలి. లేకపోతే వాటి వల్ల మంచి కంటే చెడే ఎక్కువ జరిగే ప్రమాదం ఉందంటుంది . పాలు.. పండ్లు, కాయగూరలు తాజాతాజాగా ఎప్పటికప్పుడు కొనితెచ్చుకొని పోషకాలు చెడిపోకుండా తినడం ఆరోగ్యానికెంతో మేలు.

అయితే ప్రతిరోజూ బజారుకెళ్లడానికి సమయంలేకనో.. బద్ధకించో ఒకేసారి కొని రిఫ్రిజిరేటర్లలో నిల్వచేస్తుంటారు చాలామంది. ఇలా చేయాల్సిన దాని కంటే అధిక కాలం నిల్వ చేయడం వల్ల పోషకాలు కోల్పోయే ప్రమాదంతో పాటు కొన్ని రకాల హానికారక బ్యాక్టీరియా, వైరస్‌లు వృద్ధి చెందే అవకాశం ఉంది.

ఫ్రిజ్ లో ఇలా నిల్వ చేయాలి…

కాబట్టి ఏయే ఆహారాలు ఎన్ని రోజులు నిల్వ ఉంటాయో తెలుసుకొంటే సరి. తాజాదనంతో ఆరోగ్యం…

Lakshmi Nair's tips to store vegetables in fridge for long | Food |  Manorama English

*పోషకాలు పుష్కలంగా ఉండే కోడిగుడ్లు.. గది సాధారణ ఉష్ణోగ్రత వద్ద కన్నా రిఫ్రిజిరేటర్‌లోనే సురక్షితంగా ఉంటాయి. కొన్న తర్వాత అవి రెండు వారాలపాటు తాజాగా ఉంటాయి. ఉడికించినవయితే రెండు రోజుల పాటు నిల్వ ఉంటాయి.
* పసుపు సొనను నీటిలో ఉంచి రెండు రోజులు పాటు నిల్వ చేయొచ్చు. గుడ్డు సన్నగా కోలగా ఉండే భాగాన్ని కిందికి పెట్టి భద్రపరచడం వల్ల అవి త్వరగా పగలవు.. వండటానికి అరగంట ముందు ఫ్రిజ్‌ నుంచి తీస్తే సరి. గిన్నెడు నీళ్లల్లో గుడ్డును వేసినప్పుడు అది మునిగితే తాజాగానే ఉన్నట్టు లెక్క.
* రసాయనాలకు దూరంగా.. ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే వాటి శుభ్రత..నిల్వల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

* పాలకూర, తోటకూర, కొత్తిమీర వంటి వాటిని నేరుగా వండి తినేయడం కాకుండా ముందుగా వాటిపై చల్లిన కీటకనాశన రసాయనాలను ఉప్పు కలిపిన నీటిలో శుభ్రం చేసుకోవాలి. ఇక నిల్వ విషయానికి వస్తే రిఫ్రిజిరేటర్లలో ఇవి రెండు రోజులకు మించి నిల్వ ఉండవు. పాలకూర వంటివి త్వరగా కుళ్లిపోతాయి. చల్లని నీటిలో కడిగి నీరు మొత్తం పోయిన తర్వాత గాలిచొరని డబ్బాలో పెట్టి, ప్రత్యేకంగా ఇచ్చిన అరలో పెట్టాలి. పాలు..

* పెరుగు భద్రం పాలు, పాల ఉత్పత్తులను నిల్వచేసే విషయంలో పరిశుభ్రత.. పాశ్చురైజేషన్‌ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఇంట్లోనే కొందరు ఐస్‌క్రీంలు తయారుచేస్తుంటారు. అటువంటి వారు పాశ్చరైజేషన్‌ చేయని పాలు, గుడ్డువంటిని వాటిని వీటి తయారీలో ఉపయోగించకపోవడమే మేలు.
* మరికొన్ని సార్లు ఐస్‌క్రీం తయారీకి వాడే మూసలు శుభ్రంగా లేకపోవడం వల్ల సాల్మోనెల్లా వంటి ప్రమాదకర బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. పాశ్చరైజేషన్‌ చేసిన పాలను మూడు రోజుల పాటు వాడుకోవచ్చు. దాంతో పాటు ప్యాకెట్‌పై ముద్రించిన కాలపరిమితిని పరిశీలించడం తప్పనిసరి.
* పెరుగు, చీజ్‌ వంటివి నాలుగు రోజులు నిల్వ ఉంటాయి. పోషకాల పండ్లు.. కాయగూరల కోసం వండిన కూరలని.. పండ్లని ఫ్రిజ్‌లో ఉంచితే ఎన్నిరోజులయినా నిల్వ ఉంటాయి అనుకొంటారు చాలామంది గృహిణులు. కానీ ఇది పొరపాటు. వాటికీ ఒక పరిమితి ఉంది. వండిన కూరలు రెండు రోజులకు మించితే తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.

How to keep your leafy greens fresh for longer (part 1)How to Clean and  Store Green Vegetables | - YouTube* అలాగే పండిన నిమ్మ జాతి పండ్లు ఫ్రిజ్‌లో పదిరోజుల వరకు ఉంటే యాపిల్‌, పియర్స్‌ పండ్లు మూడు నెల్ల వరకు నిల్వ ఉంటాయి. టమాటా పండ్లని ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా టమాటాలు పగిలిన చోట వృద్ధి చెందుతాయి. అందుకే వాటిని శుభ్రంగా కడిగి వంటకు ఉపక్రమించడం మేలు.
* నిల్వతో సమస్య.. మాంసాన్ని నిల్వ ఉంచే కొద్దీ అంటే ప్రతి ఇరవై నిమిషాలకు బ్యాక్టీరియా రెట్టింపు వేగంతో వృద్ధి చెందుతుంది. ఇక చేపలు, రొయ్యలు వంటివి డీప్‌ఫ్రిజ్‌లో చిల్లర్‌లో భద్రపరచడం వల్ల కొన్ని వారాలు పాటు నిల్వ ఉంటాయి. రొయ్యలనయితే పొట్టు తీసి ప్రత్యేక పాలిథీన్‌ బ్యాగుల్లో ఉంచాలి. చేపలను కూడా పొలుసు తీసి శుభ్రం చేసి చిల్లర్‌లో ఉంచితే రెండు మూడు రోజులు నిల్వ ఉన్నా కొన్ని రకాల టాక్సిన్లు విడుదలయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఎక్కువ నిల్వ పనికిరాదు.

ఇక్కడ సురక్షితం..

* చీజ్‌, కేక్‌, గుడ్లు వంటి వాటిని ఐదు నుంచి ఎనిమిది డిగ్రీల వద్ద ఉంచాలి. పాల ఉత్పత్తులను నాలుగు డిగ్రీల వద్ద ఉంచితే సరి.
* కాయగూరలు, ఆకుకూరలు, క్యాలీఫ్లవర్‌, యాపిల్‌, వంటి వాటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరలో ఎనిమిది నుంచి పది డిగ్రీల మధ్యలో ఉంచాలి.శీతల పానీయాలను పది నుంచి పదిహేను డిగ్రీల మధ్య ఫ్రిజ్‌ తలుపులో ఉంచాలి.

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి

No comments

Post Top Ad

Post Bottom Ad