ఆడవారికన్నా మగవారే ఎక్కువ అబద్ధాలు చెబుతారంట..!! ఆడవారితో చెప్పే 7 అబద్ధాలు..
మగవారిలో, ఆడవారిలో ఎవరెక్కువ అబద్ధాలు చెబుతారో ఊహించండి.. ? ఇంకెవరు ఆడవారంటార! కాదండోయ్ ఆడవారికన్నా మగవారే ఎక్కువ అబద్ధాలు చెబుతారంటున్నాయి అధ్యయనాలు. నిజమంటండీ… నమ్మరా…? సరే ఇంతకీ మగవారు ఆడవారితో ఎందుకు అబద్ధాలు చెబుతారో తెలుసా? ఆడవాళ్లు ఏదైనా గొడవ మొదలుపెడితే ఆ గొడవను ఆపడానికి, తమ తమ గర్ల్‌ఫ్రెండ్స్‌ను సంతోషపరచడానికి ఇలా మరికొన్ని సమయాలలో మగవారు అబద్ధాలు అతి సుళువుగా చేప్పేస్తారంటండి. మరి అవేంటో చూసేద్దామా.
- నేను ఆమెను చూడడం లేదు
మగవారు తమ పార్ట్‌నర్లతో ఉన్నపుడు ఎవరైనా అందమైన ఆమ్మాయిలు వారి ముందుగా వెళితే కళ్లు వాటంతటవే వారి వైపు తిరుగుతాయట. ఆడవారు ఆ విషయం గమనించి అడిగితే చూసి కూడా చూడలేదనీ, నువ్వు పక్కనుండగా మరొకరెందుకని ఈజీగా బుకాయించేస్తారట.
- ఛా నా కలలో ఇంకో అమ్మాయినా నో ఛాన్స్!
ఛా నా కలలో ఇంకో అమ్మాయినా నో ఛాన్స్! నీకు తప్ప మరో అమ్మాయికి కలలో కూడా చోటులేదు. మగవారు తమ కలలో వారి వారి స్వప్నసుందరులను ఊహించుకుంటూ కలలు కంటారట. ఒకవేళ నిద్రలో కలవరిస్తూ దొరికిపోయినా ఛా.. నా జీవితంలోనే కాదు కలలో కూడా నీకు తప్ప మరొకరికి చోటులేదు. అంటూ మభ్యపెడుతారట. వాస్తవానికి ఏ భర్తకూ భార్య కలలో రారట. ఎందుకంటే భార్య వాస్తవం కాబట్టి అంటున్నారు.
- మర్చిపోలేదు నాకు గుర్తుంది
మగవారు మరీ తరచుగా ఈ వాఖ్యానాన్ని ఆడవారి వద్ద వాడేస్తారట. ఆడవారు ఏమైనా తీసుకురమ్మని చెబితే అవి మరిచిపోవడమే కాక నువ్వు చెబితే మరిచిపోతానా ఓ పనుండి అటువైపుగా వెళ్లలేదు. రేపు ఎంతపని ఉన్నా ఖచ్చితంగా తీసుకువస్తానంటారట.
- నువ్వు లేకుండా నేను ఒక్క రోజు కూడా బ్రతకలేను
నువ్వు లేకుండా నేను ఒక్క రోజు కూడా బ్రతకలేనంటారట. కానీ వాస్తవమేంటంటే మగవారు ఒక్కసారి విందు వినోదాలలో మునిగితే ఆడవారు అసలు గుర్తుకే రారట.
- నేనా నిద్రపోవడం లేదు నువ్వు చెప్పేవి వింటూ అలోచిస్తున్నా
తమ గర్ల్‌ఫ్రెండ్సో , పార్టనరో ఏవైనా అనవసర విషయాల గురించి మాట్లాడుతుంటే అవి వింటున్నట్లు తల ఊపుతూ తమ లోకంలో తాముంటారట మగవారు. ఒకవేళ ఆడవారి ఆ విషయం కనిపెట్టి అడిగితే, లేదు లేదు నువ్వు చెప్పినవి వింటూ ఆలోచిస్తున్నా అంటారట. పొరపాటున ఆమేగాని… సరే ఏమి చెప్పానో చెప్పు అంటే ఇక అడ్డంగా దొరికిపోయినట్లేనట.
- ఆ విషయం నాకు తెలియదనుకుంటున్నావా…?
ఏదైనా విషయం తెలియదు అని ఆడవారి ముందు ఒప్పుకోడానికి మగవారికి నామోషీనట. ఆడవారికి తెలిసిన విషయాన్ని మగవారు తమకు తెలియకపోయినా తెలుసని బుకాయిస్తారట, అలా ఇలా మాటల్లోకి దింపి ఆ విషయాన్ని మొత్తానికి ఆడవారి నుండే రాబడుతారట.
- తాగడం నీకు ఇష్టం లేదనే చెప్పా కాని నా ఫ్రెండ్స్ బలవతంగా తాగించారు
ఇంకెప్పుడు తాగను. అప్పటికీ నీకు నేను మందు తాగడం ఇష్టం లేదనే చెప్పా. కాని వాళ్లు వింటేగా బలవంతంగా తాగించేశారు అంటూ మగవారు ఇలా మొదలెడతారట, కాని వాస్తవమేంటంటే ఒకరు బలవంతం పెట్టే విషయం పక్కన పెడితే మందు తాగేప్పుడు భార్యకు ఇష్టం లేదన్న మాట మగవారికి గుర్తుకేరాదట. ఒకవేళ వచ్చినా పైన చెప్పినట్లు సాకు చెప్పి తప్పించుకోవచ్చనే ధీమాతో ఫుల్లుగా కొట్టేస్తారట.
No comments