Header Ads

ఇల్లంతా వాసన వస్తుందా?దాని కోసం ఫ్రెష్ణర్ వాడుతున్నారా? ఇలాగా చేస్తే రూమ్ ఫ్రెష్ణర్ వాడాల్సిన అవసరం లేదు

కొన్ని సువాసనలు మెదడుని చురుగ్గా మారుస్తాయి. మనసుని తేలికపరుస్తాయి. గదిని పరిమళభరితం చేస్తాయి. దానికోసం ఎక్కువ ఖరీదుపెట్టి రూమ్‌ఫ్రెష్‌నర్లనీ, అరోమా కొవ్వొత్తులనీ కొనాలని లేదు. అందుబాటులో ఉండే వస్తువులతోనే ఆ సువాసనల్ని ఆస్వాదించొచ్చు. ఇంటిని సహజ సిద్ధంగా సువాసనగా మార్చుకోవచ్చు.

My House Smells Musty | How to Get Rid of Old House Smell

ఇలాచేస్తే మీ ఇల్లు పరిమళాలు వెదజల్లుతుంది:

  • సన్ననిమంటపై పెనం పెట్టి.. దానిపై కమలా, నారింజ ఫలం తొక్కల్ని వేయాలి. అవి వేగేకొద్దీ గదంతా తాజా వాసనలు వ్యాపిస్తాయి.
  • కుదిరితే లావెండర్‌నూనెలో దూదిని ముంచి గదిలో అక్కడక్కడా ఉంచినా దుర్వాసనలు దూరమవుతాయి.
  • గదిలో వెలిగే ట్యూబ్‌లైట్‌పై మీకు నచ్చిన అరోమానూనెను రెండుచుక్కలు చల్లండి. దాన్నుంచి విడుదలయ్యే వేడికి సువాసనలు గదంతా వ్యాపిస్తాయి.
  • చిన్న గిన్నెలో సగం వరకూ నీళ్లు తీసుకోవాలి. అందులో ఒక నిమ్మకాయ రసాన్ని, కొంచెం రోజ్‌మెరీ, అరచెంచా వెనిల్లాను చేర్చండి. ఇప్పుడు సన్నని మంట మీద ఈ నీటిని మరిగించండి. దాన్నుంచి వచ్చే సువాసన రోజంతా ఉంటుంది.
  • ఇంట్లో ఘాటైన వాసనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడు దాల్చినచెక్క పొడి, రెండు లవంగాలను పెనంపై వేడి చేసి చూడండి.
  • చిన్న కప్పులో వెనిల్లా లేదా వెనిల్లా ఎసెన్స్‌ని వేసి గదిలో అక్కడక్కడా ఉంచండి. తేలికైన సువాసన మెదడుకి హాయినిస్తుంది. లేదంటే వెనిగర్‌, బేకింగ్‌ సోడా మిశ్రమాన్నీ ఇలా చేసుకోవచ్చు.
  • గులాబీనీళ్లు, నిమ్మగడ్డి నూనెను గోరువెచ్చని నీటిలో కలిపి గదుల్లో అక్కడక్కడా చల్లినా ఇల్లంతా తాజాదనంతో కూడిన పరిమళం వ్యాపిస్తుంది.
  • వంటల తాలూకు ఘాటైన వాసనల్ని దూరం చేయాలంటే చిన్న గిన్నెలో చెంచా వెనిగర్‌, సగం కప్పు నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టాలి. ఆ వాసన గదిని ఆహ్లాదభరితంగా మారుస్తుందిWB - The Best Cleaners!

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి

No comments

Post Top Ad

Post Bottom Ad