Header Ads

పాపం సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు.. పిల్లను ఇవ్వడంలేదు, ఎందుకో తెలుసా?!! ఏంటో మీరే తెలుసుకోండి

ఓడలు బండ్లవుతాయి.. బండ్లవుతాయనే సామెత ఊరకనే రాలేదు. వీరిని చూస్తే ఈ సామెత అక్షరాలా నిజమని మరోసారి ఒప్పుకుంటారు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు వాళ్ల డిమాండ్ అంతా ఇంతా కాదు. ఐటీ అల్లుళ్లను పోటీలు పడి మరీ తెచ్చుకున్నారు. మా అల్లుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అంటే అదో స్టేటస్ సింబల్. ఎందుకంటే.. లక్షల్లో జీతాలు, అప్పుడప్పుడు విదేశీ టూర్లు. పట్టుమని పాతికేళ్లు నిండకుండానే ఆరు అంకెల జీతం తీసుకున్న భారత దేశపు మొదటి తరం వారు.. అందుకే పిల్లను ఇవ్వటానికి ఆడపిల్ల తల్లిదండ్రులు పోటీ పడేవారు.

Indian H-1B Visa Holders In US Face Layoffs As Coronavirus Topples Economy  | HuffPost India

ఇప్పుడు సీన్ మారింది. ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల కోత.. తొలగింపుతో వారికీ పెళ్లి కష్టాలు వచ్చాయి. మ్యారేజ్‌ బ్యూరో లో అయితే.. ఐటీ ఎంప్లాయిని వద్దుంటున్నారని మ్యాట్రిమోనియల్‌ వెబ్‌సైట్స్ ఓపెన్ గానే చెప్పేస్తున్నాయి. ఎందుకంటే..

ఐటీ ఇండస్ట్రీపై ఆటోమేషన్ తోపాటు.. అమెరికా కూడా స్థానికులకే అవకాశాలు అంటోంది. దీంతో ఐటీ ఉద్యోగుల డాలర్ డ్రీమ్స్ కరిగిపోయాయి. ఉన్న ఉద్యోగం ఉంటే చాలు అనే స్థాయికి వచ్చేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. దీంతో పెళ్లికి రెడీగా ఉన్న కుర్రోళ్లకు కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యంగా పెద్దలు కుదిర్చే సంబంధాల్లో ఐటీకి డిమాండ్ బాగా తగ్గింది. అబ్బాయి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అంటే.. అమ్మాయి తల్లిదండ్రులు వెనకాడుతున్నారు. ఇప్పుడు ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియదు కాబట్టి.. పిల్లను ఎలా ఇస్తాం అంటూ వెనుకడుగు వేస్తున్నారు. వీళ్లందరూ కూడా సివిల్ సర్వీసెస్, ప్రభుత్వ ఉద్యోగులు, డాక్టర్‌, బిజినెస్‌, లెక్చరర్ అల్లుళ్ల కోసం ఆరా తీస్తున్నారు.

How to Reject a Marriage Proposal: 12 Steps (with Pictures)

భారత్‌లో అతిపెద్ద మ్యాట్రిమోనియల్‌ వెబ్‌సైట్లలో షాదీ.కామ్‌, జీవన్‌సాథి.కామ్‌ ఉన్నాయి. 2016 నవంబర్ నుంచి ప్రతి నెలా ఐటీ ఉద్యోగికి పిల్లనిచ్చేవారు తగ్గుతూ వస్తున్నారని చెబుతున్నాయి వీరి లెక్కలు. ఈ తగ్గుదల నవంబర్‌లో 11 శాతం ఉంటే.. అది 2017 ఫిబ్రవరి నాటికి 15 శాతం తగ్గిందని వెల్లడించారు షాదీ డాట్ కామ్సీఈవో గౌరవ్‌. ప్రస్తుత పరిస్థితులే మరికొన్నాళ్లు కొనసాగితే 20శాతం డిమాండ్ తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. ఒక్క ఇండియాలోనే కాదు.. అమెరికాలో సెటిల్ అయ్యి.. అక్కడే ఉద్యోగం చేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్లపైనా ఆసక్తి చూపటం లేదట అమ్మాయి తల్లిదండ్రులు. అమెరికాలో ట్రంప్‌ విధానాలతో భవిష్యత్ భయం పట్టుకుందని.. అక్కడ పరిస్థితులు చక్కబడే వరకు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకు పెళ్లి కష్టాలు తప్పవని చెప్పుకొచ్చారు. ఐటీ ఉద్యోగులకు లేఆఫ్స్‌ ఇబ్బందులే కాక.. కొత్తగా పెళ్లి కష్టాలు వచ్చాయి.

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి

No comments

Post Top Ad

Post Bottom Ad