Almonds Health Benefits: బాదం పప్పులు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మరో శాస్త్రీయ అధ్యయనంలో నిర్థారణ అయ్యింది. రోజూ తీసుకునే స్నాక్స్‌కు బదులు బాదం పప్పులు తింటే గుండె పనితీరు మెరుగుపడుతుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
బాదం పప్పులు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మరో శాస్త్రీయ అధ్యయనంలో నిర్థారణ అయ్యింది. రోజూ తీసుకునే స్నాక్స్‌కు బదులు బాదం పప్పులు తింటే గుండె పనితీరు మెరుగుపడుతుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపే అంశాల్లో మానసిక ఒత్తిడి ప్రధాన కారణం కావడం తెలిసిందే. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్న వారిలోనే గుండె సమస్యలు ఏర్పడుతున్నట్లు ఇప్పటికే పలు పరిశోధనల్లో నిర్థారణ అయ్యింది. అయితే మానసిక ఒత్తిడి కారణంగా గుండె సమస్యలు ఉత్పన్నంకాకుండా బాదం పప్పులు రక్షణ కవచంలా నిలుస్తాయని ఇప్పుడు అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురించిన అధ్యయన నివేదికలో నిపుణులు తెలిపారు.
ప్రధానంగా మానసిక ఒత్తిడితో హార్ట్ రేట్ వేరియబిలిటీ (హెచ్ఆర్‌వీ) పడిపోవడాన్ని బాదం నిరోధిస్తుందని ఆ అధ్యయనంలో శాస్త్రవేత్తలు తెలిపారు. హెచ్ఆర్‌వీని నియంత్రణలో ఉంచుకోవాలంటే శారీరక వ్యాయామం, డైట్ చాలా కీలకమని వెల్లడించారు. ఆరు వారాల పాటు బాదాంను స్నాక్స్‌గా తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని...దీన్ని తీసుకున్న వారిలో హృదయ స్పందనలు బాగున్నాయని చెప్పారు.
No comments