Header Ads

లవంగాలు రోజూ తింటే... ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Health Benefits of Cloves: మనందరి ఇళ్లలోనూ లవంగాలు ఉంటాయి. అవి లేని పోపుల డబ్బా ఉండదు. ఎందుకంటే లవంగాలు చేస్తున్న మేలు అలాంటిది. ఆ ప్రయోజనాలు తెలుసుకుందాం.


జనరల్‌గా లవంగాల్ని వంటల్లో, మాంసం కూరల్లో, బిర్యానీ తయారీలో వేస్తారు కదా. అలా చెయ్యడం వల్ల ఆ కూరకు టేస్ట్ పెరగడమే కాదు... మన ఆరోగ్యానికి ఎంతో మేలు కూడా. లవంగాల్ని కూరలతోపాటూ... కాస్మొటిక్స్, ఫార్మాస్యూటికల్, వ్యవసాయ ఉత్పత్తుల్లో ఎక్కువగా వాడతారు. ఈ పువ్వుల వల్ల మన పళ్లు, చిగుళ్లు దెబ్బతినకుండా ఉంటాయి. లవంగాల్ని పొడిగా చేసి... దెబ్బతిన్న దంతం దగ్గరా, పాడైన చిగుళ్ల దగ్గరా పెట్టుకుంటే... మెల్లమెల్లగా అది మందులా పనిచేసి... నొప్పిని తగ్గించేస్తుంది. అందుకే టూత్‌పేస్ట్ తయారీలో లవంగాల్ని వాడుతుంటారు. తీసుకున్న ఆహారం వల్లగానీ, శరీరంలోని వేడి ఎక్కువగా ఉంటే నోటి దుర్వాసన వస్తుంది. దాన్ని వెంటనే అరికట్టాలంటే రెండు, మూడు లవంగాలు నోట్లో వేసుకొని మెల్లగా నములుతూ ఉంటే తాజా స్వాస వచ్చి... నోటి దుర్వాసన పోతుంది.

No comments

Post Top Ad

Post Bottom Ad