స్టడీ...! సెక్స్ లో ఎక్కువగా పాల్గొంటే హార్ట్ ప్రాబ్లమ్స్ కు చెక్ పెట్టొచ్చట...!
ఈ లోకంలో ప్రతి ఒక్కరికీ గాలి, నీరు, ఆహారం ఎంత అవసరమో.. శృంగారం కూడా అవసరం. చాలా మంది ఈ కార్యం గురించి.. ఇది కాసేపు ఆనందాన్నిచ్చేదే అని భావిస్తుంటారు. కానీ శృంగారంలో పాల్గొనడం వల్ల ఆనందంతో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుందని చాలా మందికి తెలీదు.
ఇలాంటి శృంగారం గురించి చాలా మందికి అనేక అపొహలు ఉన్నాయి. ఎక్కువ సేపు రతి క్రీడలో పాల్గొంటే.. హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయని.. దీని వల్ల ప్రాణానికే ప్రమాదమనే పుకార్లు ఉన్నాయి.
అయితే శృంగారం అంటే మన జీవితంలోని అన్ని పనులను ఎలాగైతే చేసుకుంటామో.. దాన్ని కూడా అందులో భాగంగానే భావించాలని నిపుణులు చెబుతున్నారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. ఇటీవల యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీ పబ్లిష్ చేసిన వాటిలో సంచలన విషయలు బయటికొచ్చాయి.
పరిశోధకుల అధ్యయనం ప్రకారం శృంగారంలో రెగ్యులర్ గా పాల్గొనే వారు హార్ట్ ప్రాబ్లమ్స్ తో బాధపడేవారు చాలా వేగంగా కోలుకుంటారని.. అంతేకాదు తమ లైఫ్ ను కూడా చాలా హ్యాపీగా గడుపుతారని తేలింది. దీని గురించి నిపుణుల టీమ్ సుమారు 495 మంది జంటలపై 20 సంవత్సరాల పాటు అధ్యయనం చేశారట. ఇందులో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకొచ్చాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
హార్ట్ ఎటాక్ తర్వాత.. ఈ మధ్యన హార్ట్ ప్రాబ్లమ్స్ అందరికీ పెరుగుతున్నాయి. అయితే హార్ట్ ప్రాబ్లమ్స్ క్యూర్ అయిన తర్వాత కొందరు శృంగారంలో పాల్గొనడం లేదు. అయితే మరికొందరు మాత్రం సాధారణ శృంగార జీవితాన్ని కొనసాగిస్తున్నారని, అలా చేసిన వారు 35 శాతం వరకు మరణ ప్రమాదం నుండి తప్పించుకున్నట్లు ఆ అధ్యయనంలో తేలింది.
శృంగారంతో ఆరోగ్యం.. ఇజ్రాయెల్ దేశానికి చెందిన టెల్ అవీన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ యారిన్ గెర్బెర్ శృంగారంతో ఆరోగ్యం గురించి కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. ‘హార్ట్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నవారు.. ఏ మాత్రం భయపడకుండా శృంగారంలో పాల్గొనవచ్చని.. దీని వల్ల మీరు హెల్దీ లైఫ్ కొనసాగించి మీరు మరణం నుండి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది' అని చెప్పారు.
త్వరగా బయటపడొచ్చు.. శృంగార కార్యకలాపాల తర్వాత హార్ట్ కు ప్రాబ్లమ్స్ వస్తాయన్న అపొహలు చాలా మందిలో ఉన్నాయనీ, కానీ తాజా పరిశోధనలో ఇది నిజం కాదని తేలిందని.. అంతేకాదు ఎవరైతే హార్ట్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారో.. వారంతా రోజువారీ పనుల్లాగానే రెగ్యులర్ గా ఆ కార్యంలో పాల్గొంటే ఆ సమస్య నుండి కూడా బయటపడొచ్చని తెలిపారు. అంతేకాదు ఇది హార్ట్ ఎటాక్ ప్రమాదాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తుందని పరిశోధకులు వివరించారు.
ఈ అధ్యయనంలో.. వారు చేసిన పరిశోధనల్లో 495 మంది హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండే రోగులు పాల్గొన్నారు. వీరంతా 65 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయసు ఉన్నవారే. వీరంతా 1992-93లో హార్ట్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నవారే. కాబట్టి వీరి సగటు వయసు 53 ఏళ్లు. వీరిలో 90 శాతం మంది మగవారే ఉన్నారు.
ఇతర సమస్యలు.. అయితే 22 సంవత్సరాల తర్వాత వీరిలో 211 మంది అంటే దాదాపు 43 శాతం మంది ప్రాణాలు కోల్పోయారని పరిశోధకులు కనిపెట్టారు. కానీ అదంతా హార్ట్ ప్రాబ్లమ్ వల్ల కాదు.. శారీరక శ్రమ, ఊబకాయం వంటి ఆరోగ్య మరియు ఇతర ఆర్థిక సమస్యలు ఉన్నాయని స్పష్టం చేశారు.
తక్కువ అవకాశాలు.. ఏది ఏమైనప్పటికీ.. హార్ట్ ప్రాబ్లమ్ ఉండేవారు.. ఏ మాత్రం భయపడకుండా తమ సాధారణ శృంగార కార్యకలాపాల్లో పాల్గొనవచ్చని, దీని వల్ల మీరు హార్ట్ ఎటాక్ సమస్యల నుండి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఈ అధ్యయనంలోని ఫలితాలు చెబుతున్నాయని పరిశోధకులు వెల్లడించారు.
దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి.
No comments