మొటిమలు తగ్గడానికి కొన్ని చిట్కాలు..
సంత్రా, టమాట రసాన్ని సమపాళ్ళల్లో కలిపి ముఖానికి మాస్క్ లా వేసుకోవాలి. ఆరిన తరువాత కడిగేయండి. ఇలా రోజు చేస్తే ముఖం పై ఉన్న మొటిమలు, నల్లమచ్చలు పోయి ముఖం కాంతివంతంగా అవుతుంది.
పుదీనా ఆకులను మెత్తగా ఫెస్ట్‌లా చేసుకొని ముఖానికి మాస్క్‌లా వేసుకోవాలి. పూర్తిగా ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేయండి. కొన్ని రోజులపాటు ఇలా చేస్తే మొటిమలు మాయమైపోతాయి.
ఎండబెట్టిన సంత్రా పండు యొక్క తొక్కలు, ఎల్లిపాయలకు సరిపడా నీళ్లు కలుపుతూ పేస్ట్‌లా చేసుకోవాలి. దీనిని ముఖానికి స్క్రబ్‌లా ఉపయోగించండి.
దోసకాయను తీసుకొని దానికి ఓట్‌మిల్, మూడు టీస్పూన్స్ తేనేను కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దానిని ముఖానికి మాస్క్‌లా అప్లై చేయాలి. 20 నిమిషాల తరువాత కడిగేస్తే మొటిమలు పోయి ముఖం కాంతివంతంగా అవుతుంది.
రోజ్‌వాటర్, నిమ్మరసం సమపాళ్లలో కలిపి ముఖంపై అప్లై చేయాలి. 15-30 నిమిషాల తరువాత నీళ్లతో కడిగేయాలి.
No comments