గత పదేళ్లుగా హస్తప్రయోగం చేసుకుంటూ ఉన్నాను. దీనివల్ల భవిష్యత్తులో సెక్స్ చేయాలేనేమో అనిపిస్తోంది.
నా వయస్సు 28 ఏళ్లు. గత పదేళ్లుగా హస్తప్రయోగం చేసుకుంటూ ఉన్నాను. దీనివల్ల భవిష్యత్తులో సెక్స్ సమస్య వస్తుందేమోనని ఇటీవల ఆ అలవాటు మానేశాను. అయితే ఇప్పుడు నిద్రపోతున్నప్పుడు కలలో స్ఖలనం అవుతోంది. స్వప్నస్ఖలనాల వల్ల సెక్స్ బలహీనత వస్తుందని, దీనివల్ల భవిష్యత్తులో సెక్స్ చేయాలేనేమో అనిపిస్తోంది. మందు ఇస్తామని కొందరు చెబుతున్నారు. నాకు తగిన సలహా ఇవ్వండి.
యౌవనదశలో మీలాగా హస్తప్రయోగం చేసుకోవడం పురుషులందరిలోనూ దాదాపుగా ఉండే అలవాటు. దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి సమస్యా రాదు. మీరు అనవసరంగా అపోహతో హస్తప్రయోగం ఆపేశారు. అయితే మీరు ఈ ప్రక్రియను ఆపేసినా వృషణాల్లో వీర్యం ఉత్పత్తి ప్రక్రియ అలాగే కొనసాగుతుంటుంది. ఇలా ఉత్పన్నం అయిన వీర్యం మీకు నిద్రలో పోతోంది. ఇది స్వాభావికంగా జరిగే ఒక ప్రక్రియ. దీనికోసం మందులు వాడనవసరం లేదు. మందులు ఇస్తామంటున్నవారు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. వారు బహుశా మీ బలహీనత నుంచి లబ్ధిపొందుతున్నారు. మీరు అన్నివిధాలా నార్మల్‌గా ఉన్నారు. మందులు వాడనవసరం లేదు. కెరియర్‌లో స్థిరపడి త్వరగా పెళ్లిచేసుకొని, మంచి దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేయండి. ( డాక్టర్ వి. చంద్రమోహన్ )