ప్రతిరోజూ శృంగారంలో పాల్గొంటాం. ఒక్కోసారి నేను వీర్యం మింగేస్తుంటాను. దానివల్ల ఏదైనా ప్రమాదం ఉంటుందా?
నా వయసు 33. ఇద్దరు పిల్లలు. ఇప్పటికీ నేను, మావారు ప్రతిరోజూ శృంగారంలో పాల్గొంటాం. ఆ సమయంలో అంగచూషణను బాగా ఎంజాయ్ చేస్తుంటాం. అలాంటప్పుడు ఒక్కోసారి నేను వీర్యం మింగేస్తుంటాను. దానివల్ల ఏదైనా ప్రమాదం ఉంటుందా?
అంగచూషణ చేసేటప్పుడు ఒక్కోసారి మగవారి అంగం మీద ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే… అది మీ నోటి ద్వారా లోనికి వెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే మీ నోటిలో, దంతాల్లో, చిగుళ్లలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే… అది మీవారికి సోకే అవకాశమూ ఉంది. సాధారణంగా వీర్యంలో కొద్దిగా చీము కణాలు ఉంటాయి. కొందరిలో హర్పిస్, గనోరియల్, సిఫిలిస్, ఫంగల్ ఇంకా ఇతరత్రా సుఖవ్యాధులకు సంబంధించిన క్రిములు కూడా ఉండవచ్చు. ఆడవారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు…. నోటిలో పుండ్లు, పగుళ్లు వంటివి ఉన్నప్పుడు ఆ ఇన్ఫెక్షన్లు వారికి కూడా సోకే ప్రమాదం ఉంది.
కొన్నిసార్లు పై కారణాలు లేకుండా కూడా ఇన్ఫెక్షన్ సోకుతుంది. దాంతో నోటిలో పొక్కులు, కురుపులు, పుండ్లు ఏర్పడతాయి. జ్వరంతో పాటు మరికొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. ఒకవేళ మగవారిలో హెచ్‌ఐవీ, హెపటైటిస్ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు ఉంటే అవి కూడా సోకవచ్చు. అందువల్ల అంగచూషణ పూర్తిగా సురక్షితమని చెప్పడానికి లేదు. మీరిద్దరూ దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి, కండోమ్ వాడుకోవడం ఇద్దరికీ మంచిది. ( డా. వేనాటి శోభ)